Bheemili: సాధారణ ఓటరులా క్యూలైన్లో నిలబడి ఓటు వేసిన శ్రీనివాసరావు!

Bheemili: మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని భీమిలి 3వ వార్డులో తన ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ మంత్రి ముత్తంశెట్టి (అవంతి) శ్రీనివాసరావు.

SHIVA, BHIMILI
Published on: 1 Nov 2026 6:07 PM IST
Bheemili
X

Bheemili: సాధారణ ఓటరులా క్యూలైన్లో నిలబడి ఓటు వేసిన శ్రీనివాసరావు!

Bheemili: భీమిలి మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని భీమిలి నియోజకవర్గం 3వ వార్డులో ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా సాగుతోంది. ఇందులో భాగంగా మాజీ మంత్రి ముత్తంశెట్టి (అవంతి) శ్రీనివాసరావు ఆదివారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. భీమిలిలోని స్థానిక పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆయన, సాధారణ ఓటర్లతో పాటు క్యూ లైన్ లో నిలబడి ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వేశారు.

ఓటు వేసిన అనంతరం ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, సమాజ మార్పునకు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI