Bheemili: ఇళ్ల పట్టాలు ఇవ్వాలని భీమిలి ఆర్డీవోకు వినతి

Bheemili: జీవో నంబర్ 30 ప్రకారం సబ్బివీధిలో నివసిస్తున్న 9 పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ భీమిలి ఆర్డీవో సంగీత్ మాధుర్‌కు సీపీఎం నేతృత్వంలో వినతిపత్రం అందజేశారు.

SHIVA, BHIMILI
Published on: 5 Oct 2026 5:12 PM IST
Bheemili
X

Bheemili: ఇళ్ల పట్టాలు ఇవ్వాలని భీమిలి ఆర్డీవోకు వినతి

Bheemili: జి వి ఎం సి రెండో వార్డు పరిధి సబ్బిబీది లో రోడ్డుకు అనుకుని ప్రభుత్వ స్థలంలో ఏళ్ల తరబడి నివసిస్తున్న తమకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ తొమ్మిది పేద కుటుంబాలు సోమ వారం సిపిఎం భీమిలి జోన్ కార్యదర్శి ఆర్ ఎస్ ఎన్ మూర్తి కలిసి ఆర్డీఓ సంగీత్ మా ధుర్ కు వినతి పత్రం అందజేశారు. ఇళ్ల పట్టాల కోసం సంబంధిత వార్డు సచివాలయ అధికారులను పలు దఫాలుగా కలిసి నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా సిపిఎం భీమిలి జోన్ కమిటీ కార్యదర్శి ఆర్ఎస్ఎస్ మూర్తి మాట్లాడుతూ ప్రభుత్వం తెలిపిన జీవో నెంబర్ 30 ప్రకారం ప్రభుత్వ స్థలంలో ఏళ్ల తరబడి నివసిస్తున్న పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం చెప్పినప్పటికీ వార్డు స్థాయిలో ప్రజలకు మాత్రం న్యాయం జరగలేదని ఆర్ ఎస్ ఎన్ మూర్తి ఆర్డిఓ సంగీత మాధుర్ కు వివరించారు.

సి పి ఎం భీమిలి జోన్ కమిటీ కార్యదర్శి ఆర్ ఎస్ ఎన్ మూర్తి ఆధ్వర్యంలో ఈ మేరకు వినతి పత్రం అందజేశారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI