Bheemili: మజ్జి శ్రీనివాసరావు జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు

Bheemili: వైకాపా నేత మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) జన్మదినం సందర్భంగా భీమిలి 'లిటిల్ హగ్' సంరక్షణ కేంద్రంలో చిన్నారులకు నూతన వస్త్రాలు, విందు పంపిణీ.

SHIVA, BHIMILI
Published on: 5 Sept 2026 4:16 PM IST
Bheemili
X

Bheemili: మజ్జి శ్రీనివాసరావు జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు

భీమిలి: భీమిలి నియోజకవర్గ వైస్సార్సీపీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) జన్మదిన వేడుకలు నియోజకవర్గంలో శనివారం ఘనంగా జరిగాయి. ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ వైస్సార్సీపీ భీమిలి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు ప్రశాంతి పట్నాయక్, వైస్సార్సీపీ విశాఖ జిల్లా అధికార ప్రతినిధి బింగి హరి కిరణ్ రెడ్డి సంయుక్తంగా తాళ్ళవలస పంచాయతీలోని ‘లిటిల్ హగ్’ బాలల సంరక్షణ కేంద్రంలో సేవా కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రశాంతి పట్నాయక్, హరి కిరణ్ రెడ్డి ఆధ్వర్యంలో సంరక్షణ కేంద్రంలోని చిన్నారుల చేతుల మీదుగా కేక్ కట్ చేయించి, వారికి తినిపించారు. అనంతరం చిన్నారులంతా తమ ప్రియతమ నేత చిన్న శ్రీనుకు ఉత్సాహంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

తమ నేతపై ఉన్న అపారమైన అభిమానంతో ప్రశాంతి పట్నాయక్, హరి కిరణ్ రెడ్డి తమ సొంత నిధులతో చిన్నారులకు నూతన వస్త్రాలను పంపిణీ చేయడంతో పాటు, రాత్రి పూట ప్రత్యేక విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు.బాలల సంరక్షణ కేంద్రం వ్యవస్థాపకులు వెంపాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రశాంతి పట్నాయక్, హరి కిరణ్ రెడ్డిలు కేవలం శుభకార్యాలకే పరిమితం కాకుండా,

ఈ సంరక్షణ కేంద్రానికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తమ వంతు సహాయ సహకారాలను ఎల్లప్పుడూ అందిస్తూనే ఉంటారని కొనియాడారు. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)కు దైవాశీస్సులు మెండుగా ఉండాలని, ఆయన నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story