Bheemili: స్వగృహంలో కుటుంబంతో కలిసి దీపావళి జరుపుకున్న గంటా శ్రీనివాసరావు

Bheemili: విశాఖ ఎంవీపీ కాలనీలోని స్వగృహంలో కుటుంబ సభ్యులతో దీపావళి జరుపుకున్న భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. మున్సిపల్, పరిషత్ ఎన్నికల విజయంపై హర్షం.

SHIVA, BHIMILI
Published on: 8 Nov 2026 9:10 PM IST
Bheemili
X

Bheemili: స్వగృహంలో కుటుంబంతో కలిసి దీపావళి జరుపుకున్న గంటా శ్రీనివాసరావు

భీమిలి: మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దీపావళి పండుగను ఎంవీపీ కాలనీలోని స్వగృహంలో కుటుంబంతో కలిసి ఈరోజు ఘనంగా జరుపుకున్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి.

మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక వైసీపీపై జయకేతనాన్ని ఎగురవేసి కూటమి శ్రేణులు రాష్ట్రానికి ముందుగానే వెలుగుల పండుగను తీసుకువచ్చారని ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ చెప్పారు.

ఏకపక్ష తీర్పునిచ్చిన ప్రజలకు అభినందనలు తెలియజేశారు. సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలవాలని ఆకాంక్షించారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI