Bheemili: మధురవాడ కళ్యాణ మండపాలను పరిశీలించిన ఎమ్మెల్యే గంటా!

Bheemili: మధురవాడ పరిధిలోని కళ్యాణ మండపాలను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. అనంతరం సాయిరాం కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

JAI RAM, MADURAWADA
Published on: 25 Aug 2026 11:13 PM IST
Bheemili
X

Bheemili: మధురవాడ కళ్యాణ మండపాలను పరిశీలించిన ఎమ్మెల్యే గంటా!

భీమిలి: కొమ్మాది, సాయిరాం కాలనీ కళ్యాణమండపాలలో పెండింగ్ పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. మంగళవారం అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ఈ రెండు మండపాలను ఆయన సందర్శించారు.

అసంపూర్ణ నిర్మాణాల కోసం గంటా చొరవ తీసుకుని రూ.1.66 కోట్లు నిధులు మంజూరు చేయించగా, అన్ని హంగులతో కళ్యాణ మండపాలను సిద్ధం చేశారు. అయితే ఫాల్ సీలింగ్, నీటి వసతి వంటి చిన్నపాటి పనులు పెండింగ్ లో ఉన్నందున వాటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు.

కార్యక్రమంలో జోనల్ కమిషనర్ వి.అయ్యప్ప నాయుడు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు వెంకట వాసు, స్థానిక నాయకులు నాగోతి సత్యనారాయణ, మొల్లి లక్ష్మణరావు, గరే గుర్నాథ్, లొడగల జానకిరామ్, గడ్డి శ్రీను, కానూరు అచ్యుతరావు, బోయి శ్రీను, నాగోతి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

ఇంటింటి ప్రచారంలో గంటా

జీవీఎంసీ 5 వ వార్డులోని సాయిరాం కాలనీలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇంటింటికి తెలుగుదేశం ప్రచారం నిర్వహించారు. కరపత్రాలు పంచి రెండేళ్లలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగించామని తెలియజేశారు. మహిళల కోసం స్త్రీ శక్తి, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా ప్రతినెల 1 వ తేదీన క్రమం తప్పకుండా పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు.

JAI RAM, MADURAWADA

JAI RAM, MADURAWADA

Next Story