Bheemili: పిలకవానిపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ
Bheemili: భీమిలి నియోజకవర్గం పిలకవానిపాలెంలో కార్పొరేటర్ పిళ్లా మంగమ్మ, పిళ్లా వెంకట్రావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు.
Bheemili: పిలకవానిపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ
భీమిలి: అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్ భరోసా పింఛన్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని 7వ వార్డు కార్పొరేటర్ పిళ్లా మంగమ్మ, టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం నిర్వాహక కార్యదర్శి పిళ్లా వెంకటరావు అన్నారు.
భీమిలి నియోజకవర్గం 7వ వార్డు పరిధిలోని పిలకవానిపాలెంలో గురువారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేదలకు పింఛన్లు ఎంతో ఆర్థిక భరోసాను కల్పిస్తున్నాయని తెలిపారు. అర్హులైన ఏ ఒక్కరూ పింఛన్‌కు దూరం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.




