Bheemili: యేట కుమ్మరిపాలెంలో జూద స్థావరంపై దాడి – 7 మంది అరెస్ట్

Bheemili: విశాఖ జిల్లా యేట కుమ్మరిపాలెంలో అక్రమ జూదంపై భీమిలి పోలీసుల దాడి. 7 మంది జూదగాళ్ల అరెస్ట్, రూ.1820 నగదు స్వాధీనం. కేసు నమోదు చేసి దర్యాప్తు.

SHIVA, BHIMILI
Published on: 21 Aug 2026 9:34 PM IST
Bheemili
X

Bheemili: యేట కుమ్మరిపాలెంలో జూద స్థావరంపై దాడి – 7 మంది అరెస్ట్

భీమిలి: గౌరవనీయులైన విశాఖపట్నం సిటీ పోలీస్ కమీషనర్ శ్రీ శంకబ్రత బగ్చి IPS గారి ఆదేశాల మేరకు భీమిలి సి.ఐ శ్రీ దివాకర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు యేట కుమ్మరిపాలెం ప్రాంతంలో అక్రమ జూదంపై ప్రత్యేక దాడి నిర్వహించారు.

ఈ దాడిలో 7 మంది జూదగాళ్లను అదుపులోనికి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ.1820/- నగదు ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అక్రమ జూదం, ఇతర అసాంఘిక కార్యకలాపాలను ఏమాత్రం సహించబోమని సి.ఐ గారు హెచ్చరించారు. ఇలాంటి కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story