Visakhapatnam: భీమిలి పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం!
Visakhapatnam: విశాఖ సీపీ శంకబ్రత బాగ్చీ ఆదేశాలతో భీమిలి పోలీసుల ఆధ్వర్యంలో చిప్పాడ గ్రామంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు.
Visakhapatnam: భీమిలి పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం!
విశాఖపట్నం: గౌరవనీయులైన విశాఖపట్నం సిటీ పోలీస్ కమీషనర్ శ్రీ శంకబ్రత బగ్చి IPS గారి దయగల ఆదేశాల మేరకు ఈరోజు భీమిలి సి.ఐ శ గారి ఆధ్వర్యంలో చిప్పాడ గ్రామం మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది.
ఈ క్యాంపు ద్వారా గ్రామ ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించారు. మొత్తం 14 మంది గ్రామస్తులు క్యాంప్ ను సద్వినియోగం చేసుకుని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి ఉచిత మందులు కూడా పంపిణీ చేశారు.
పోలీసులు-ప్రజలు మధ్య స్నేహపూర్వక వాతావరణం పెంపొందించేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తామని సి.ఐ గారు తెలిపారు. క్యాంప్ లో పాల్గొన్న డాక్టర్లకు మరియు సిబ్బందికి సి.ఐ గారు కృతజ్ఞతలు తెలియజేశారు.
Next Story




