Bheemili: 24 గంటల్లో మిస్సింగ్ బాలుడిని పట్టుకున్న భీమిలి పోలీసులు
Bheemili: విశాఖ సీపీ శంఖబ్రత బగ్చి ఆదేశాలతో ఇంట్లో నుంచి రూ.65 వేలతో పారిపోయిన 13 ఏళ్ల బాలుడిని 24 గంటల్లోనే భీమిలి పోలీసులు సురక్షితంగా రక్షించారు.
Bheemili: 24 గంటల్లో మిస్సింగ్ బాలుడిని పట్టుకున్న భీమిలి పోలీసులు
Bheemili: భీమిలి పరిధిలో 13 సంవత్సరాల మైనర్ బాలుడు ఇంట్లో స్కూల్ మానేశాడని తండ్రి మందలించడంతో, ఇంట్లో నుండి రూ. 65,000/- తీసుకుని వెళ్లిపోయినట్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.
విషయాన్ని సీరియస్ గా తీసుకున్న భీమిలి CI శ్రీ జి. దివాకర్ యాదవ్ గారు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానంతో గాలింపు చేపట్టారు.
బాలుడు ఇంటి నుండి వెళ్లిన తర్వాత మొబైల్ ఫోన్ కొనుగోలు చేసి, బస్సులో విజయవాడ వెళ్లి, అక్కడ సైకిల్ కొనుగోలు చేసి హైదరాబాద్ వెళ్తుండగా మార్గమధ్యంలో భీమిలి CI గారి టీం అతన్ని గుర్తించి సురక్షితంగా అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం బాలుడికి కౌన్సెలింగ్ నిర్వహించి, ఈరోజు తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించడం జరిగింది. బాలుడి తల్లిదండ్రులు గౌరవ సీపీ గారికి మరియు భీమిలి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.




