Bheemili: చిల్ల హరి ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన 400 మంది వైసీపీ కార్యకర్తలు!
Bheemili: భీమిలి నియోజకవర్గం తాళ్లవలస పంచాయతీకి చెందిన వైసీపీ యువజన విభాగం మండల అధ్యక్షులు చిల్ల హరి ఆధ్వర్యంలో 400 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే గంటా సమక్షంలో టీడీపీలో చేరారు.
Bheemili: చిల్ల హరి ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన 400 మంది వైసీపీ కార్యకర్తలు!
భీమిలి,నవంబర్ 17: భీమిలి నియోజకవర్గ పరిధిలోని తాళ్లవలస పంచాయతీలో వైఎస్సార్సీపీకి భారీ షాక్ తగిలింది. వైసిపి మండల యువజన విభాగం అధ్యక్షులు చిల్ల హరి ఆధ్వర్యంలో ఆ పార్టీకి చెందిన సుమారు 400 మంది కార్యకర్తలు, నాయకులు మంగళవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. స్థానిక భీమిలి టిడిపి కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సమక్షంలో వీరంతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
పార్టీలో చేరిన వారందరికీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. నేతలు తాళ్లవలస పంచాయతీతో పాటు భీమిలి మండల వ్యాప్తంగా రాజకీయంగా, సేవా కార్యక్రమాల పరంగా మంచి పట్టు ఉన్న చిల్ల హరి టిడిపిలో చేరడం పార్టీకి అదనపు బలమని స్థానిక టిడిపి నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పార్టీలో నూతనంగా చేరిన కార్యకర్తలు మాట్లాడుతూ.. చిల్ల హరి కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా, తమ కుటుంబ సభ్యుడిలా అందరినీ ఆదరిస్తారని కొనియాడారు. అనుచరులకు, ఓటర్లకు ఏ కష్టం వచ్చినా, ఏ అవసరం ఏర్పడినా ఏ సమయంలోనైనా 'నేను ఉన్నానంటూ' ముందుండి సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. ఆయన మంచి మనస్తత్వంపై ఉన్న ఎనలేని అభిమానంతోనే తామంతా ఆయన వెంట నడుస్తున్నామని స్పష్టం చేశారు.
అనంతరం చిల్ల హరి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై టిడిపిలో చేరినట్లు తెలిపారు. తాళ్లవలస పంచాయతీలోని కూటమి నాయకులందరితో కలిసికట్టుగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేస్తానని అన్నారు. రానున్న సర్పంచ్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపునకు తన వంతు పూర్తి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.




