Bheemili: గంటా సమక్షంలో టీడీపీలోకి 300 మంది వైసీపీ కార్యకర్తలు!

Bheemili: భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సమక్షంలో మూలకుద్దు గ్రామానికి చెందిన 300 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. వారికి పసుపు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

SHIVA, BHIMILI
Published on: 18 Oct 2026 6:19 PM IST
Bheemili
X

Bheemili: గంటా సమక్షంలో టీడీపీలోకి 300 మంది వైసీపీ కార్యకర్తలు!

భీమిలి, అక్టోబర్ 18: మండలంలోని మూలకుద్దు గ్రామానికి చెందిన 300 మంది వైసీపీ కార్యకర్తలు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సమక్షంలో టీడీపీలో చేరారు. భీమిలి టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో పసుపు కండువాలు వేసి వీరందరిని పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనందపురం, జీవీఎంసీ 1 వ వార్డు తగరపువలస, 6 వ వార్డు అమరావతి నగర్ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున వైసీపీ కార్యకర్తలు చేరారని, ఇంకా అనేకమంది సిద్ధంగా ఉన్నారన్నారు. 164 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి కూటమి చరిత్ర సృష్టించిందని, భవిష్యత్ లో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు.

కార్యకర్తలు, నాయకులు సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు తీసుకు వెళ్లాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్ష విజయాలను నమోదు చేయాలని పేర్కొన్నారు. మాజీ సైనికోద్యోగుల కార్యాలయం స్థల కేటాయింపునకు కృషి చేస్తానన్నారు.

పార్టీ ఇంచార్జి చిక్కాల విజయ్ బాబు, మండల పార్టీ అధ్యక్షుడు సరగడ అప్పారావు, మాజీ జడ్పీటీసీ గాడు వెంకటప్పడు, పార్టీ మాజీ అధ్యక్షుడు డి.ఎ.ఎన్. రాజు తదితరులు పాల్గొన్నారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI