Padmanabham: పద్మనాభంలో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన గంటా
Padmanabham: పద్మనాభం ఎంపీడీఓ కార్యాలయంలో 13 రకాల భద్రతా ప్రమాణాలతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు, ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పంపిణీ చేశారు.
Padmanabham: పద్మనాభంలో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన గంటా
పద్మనాభం: మండలంలోని గంధవరం, అనంతవరం, కొవ్వాడ గ్రామాల రైతులకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం పట్టాదార్ పాస్ పుస్తకాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ 13 రకాల భద్రత ప్రమాణాలతో పాస్ పుస్తకాలు అందిస్తున్నామని తెలిపారు. మండలంలో 3,252 పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేశామన్నారు.
వివాదాలకు తావు లేని విధంగా రైతుల ఆమోదంతోనే పాస్ పుస్తకాలను జారీ చేయడం సహా లోపాలను సరి చేస్తున్నామని వివరించారు. ఇనాం భూముల సమస్యకు తొందర్లోనే పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.
వైసీపీ హయంలో జగన్మోహన్ రెడ్డి స్వలాభంతో రెవిన్యూ వ్యవస్థను అస్తవ్యస్తంగా చేశారని విమర్శించారు. అనంతరం ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో ఎమ్మార్వో శైలజ, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కురుమిన రామస్వామి నాయుడు, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, కోరాడ రమణ, కసిరెడ్డి దామోదరరావు, కాళ్ల నగేష్ కుమార్, రామరాజు, కురుమిన లీలావతి, కాళ్ల సత్యనారాయణ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.




