Padmanabham: పద్మనాభంలో వరుణ యాగం: పాల్గొన్న ఎమ్మెల్యే గంటా

Padmanabham: రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ పద్మనాభం శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నిర్వహించిన వరుణ యాగంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు.

SHIVA, BHIMILI
Published on: 6 Oct 2026 9:18 PM IST
Padmanabham
X

Padmanabham: పద్మనాభంలో వరుణ యాగం: పాల్గొన్న ఎమ్మెల్యే గంటా

పద్మనాభం: అనంత పద్మనాభ స్వామి ఆలయంలో మంగళవారం నిర్వహించిన వరుణ యాగంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విస్తారంగా వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.

ఎల్ నినో కారణంగా తీవ్ర వర్షాభావం నెలకొన్నప్పటికీ ఇటీవల కురిసిన వర్షాలతో ప్రజలకు కొంత స్వాంతన చేకూరిందన్నారు. మహిళలు ఘటాలలో తీసుకువచ్చిన పవిత్ర జలాలతో స్వామివారికి జలాభిషేకం చేశారు. వరుణ యాగంలో భాగంగా హోమం చేసి ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు శ్రీ కుంతీ మాధవ స్వామి దర్శించుకున్నారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI