Vizianagaram: నేడే భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం!
Vizianagaram: విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నేడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
Vizianagaram: నేడే భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం!
Vizianagaram: నేడే అల్లూరి సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఘనంగా ప్రారంభం..
ప్రధాని మోదీ చేతులు మీదుగా జాతికి అంకితం కానున్న విమానాశ్రయం..
ప్రధాని పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి..
ఇప్పటికే ఎయిర్ పోర్టు కు చేరుకున్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్..
మరి కాసేపట్లో ఎయిర్ పోర్టు కు చేరుకోనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..
ఉదయం 10.45 గం. లకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుండి రానున్న ప్రధాని నరేంద్ర మోదీ..
నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలకనున్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్..
ముందుగా 200 మంది విద్యార్థినిలు చేత కూచిపూడి నృత్యంతో సంప్రదాయబద్ధ ఘన స్వాగతం..
అనంతరం నేరుగా టెర్మినల్ బిల్డింగ్ వద్దకు చేరుకుని మొత్తం బిల్డింగ్ పరిశీలన..
మూడు అంతస్తులో... ఎగురుతున్న చేప ఆకృతిలో నిర్మించిన టెర్మినల్ బిల్డింగ్..
ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచిన ఏటుకొప్పాక బొమ్మలు, సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఛాయా చిత్రాలు..
టెర్మినల్ బిల్డింగ్ పరిశీలన అనంతరం ఓపెన్ టాప్ జీపులో సభా ప్రాంగణానికి చేరుకోనున్న మోదీ..
ఈ క్రమంలో 13 వేల మంది గిరిజన విద్యార్థిని, మహిళలు చేత ప్రత్యేక థింసా నృత్య ప్రదర్శన..
ఆ ప్రదర్శనను వీక్షించనున్న మోదీ..
అనంతరం 70 ఎకరాల ప్రాంతంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకోనున్న మోదీ..
అనంతరం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్నీ ప్రారంభించనున్న మోదీ..
విమానాశ్రయంతో పాటు కేంద్ర రోడ్డు, రవాణా, ఇంధన, రహదారులకు సంబంధించి రూ. 17,912 లతో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, మరికొన్ని ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేయనున్న ప్రధాని మోదీ..
అనంతరం భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న మోదీ..
మొత్తంగా రెండున్నర గంటల పాటు సాగనున్న ప్రధాని పర్యటన..
అనంతరం మ .1.10 గం. లకు తిరుగు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్న ప్రధాని మోదీ..




