Bheemili: టీడీపీకి షాక్ ఇచ్చిన బి.వి. రామ్: "నా ఆత్మగౌరవం ముఖ్యం.. అందుకే దూరం!"

Bheemili: భీమిలి గూగుల్ డేటా సెంటర్ భూములు రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్నాయని తెలుగు శక్తి రామ్ ఆరోపించారు.

GOPI, PENDURTHI
Published on: 11 May 2026 12:52 PM IST
Bheemili
X

Bheemili: టీడీపీకి షాక్ ఇచ్చిన బి.వి. రామ్: "నా ఆత్మగౌరవం ముఖ్యం.. అందుకే దూరం!"

భీమిలి: ఈ డేటా సెంటర్ భూముల్లో 90 శాతం కొండ రిజర్వ్ అడవి పరిధిలో ఉన్నప్పటికీ అంటే నోటిఫైడ్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఉందని అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించింది. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నివేదిక చూస్తే ఎలా అనుమతులు ఇచ్చారన్న ప్రశ్న ఉదయిస్తుందని భీమిలిలో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగు శక్తి అధ్యక్షులు బి.వి.రామ్ అన్నారు. ఆర్డీవో కార్యాలయంలో డిప్యూటీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ జె.తారకేశ్వరి వినతిపత్రం ఇచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ గతంలో మహానుభావుడు ఎన్టీఆర్ ప్రజలే దేవుళ్ళు అని భావించే వారన్నారు. కానీ ప్రస్తుత రాజకీయ నాయకులు తమకు తామే దైవంగా భావించి ప్రజలను భక్తులుగా చూస్తూ వారి చేత చప్పట్లు కొట్టించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

గత ప్రభుత్వం 239 ఎకరాలు లీజుకు ఇస్తే, ఈ ప్రభుత్వం దాన్ని అమ్మేయటంపై ఏ విధంగా చూడాలని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ని రామ్ ప్రశ్నించారు? ఏదైనా పెద్ద ప్రాజెక్టు పెడితే ప్రజా అభిప్రాయం సేకరణ చేస్తారు. లక్షల కోట్లు పెట్టుబడి తో తుర్లవాడలో రాబోతున్న గూగుల్ డేటా సెంటర్ 1గిగావాట్ సామర్ధ్యంతో నిర్మించబోయే, ఈ భారీ ప్రాజెక్టుకు మాత్రం ఎలాంటి పబ్లిక్ హిరింగ్ జరపలేదు. రాష్ట్ర మంత్రి వర్యులు నారా లోకేష్ ముందుచూపుతో ఇక్కడ లక్షలాది ఉద్యోగాలు తేవాలని సంకల్పంతో ఎటువంటి హియరింగ్ జరపకుండా పనులు కానిచ్చేస్తే మరి ఇటీవల విశాఖ విచ్చేసిన ఐపీఎస్ విశ్రాంత అధికారి ఏ.బీ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 500 ఉద్యోగులు వస్తాయని చెప్పినప్పుడు రాష్ట్ర మంత్రి లోకేష్ ఎందుకు స్పందించలేదని రామ్ నిలదీశారు?. తమరు లక్ష ఉద్యోగులు పైనే వస్తాయని చెప్పారు.

ఏది నిజం.... ఏది అబద్దం...!. ఇవన్నీ చూసి నట్లయితే ఏదో భారీ కుంభకోణం మాత్రమే గా ఉంది తప్ప ప్రజలకి ఎటువంటి మేలు జరగదు అని అర్థమయ్యేలా ఉందని, ప్రజల్లో అనుమానం కలుగుతుందని రామ్ అన్నారు. నిజంగా రాష్ట్ర మంత్రి లోకేష్ కి చిత్తశుద్ధి ఉంటే రేపు 17న విశాఖలో బహిరంగ చర్చికి వచ్చి ప్రజల్లో ఉన్న అనుమానాల్ని తొలగించాలని, అలాగే ప్రభుత్వం వారితో చేసుకున్న ఒప్పందాన్ని రాష్ట్ర మంత్రి లోకేష్ బయటపెట్టి, ప్రభుత్వం ఎటువంటి తప్పు చేయలేదని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత మీ పై ఉందని రామ్ అన్నారు. 99 పైసలకే ఎకరా భూమిని అప్పగించడం తప్పు కాదని.. కానీ ఒక ఎకరాకు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారో ముందుగానే హామీ తీసుకొని అప్పుడు భూములను సదరు సంస్థలకు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు.

రాష్ట్రపతికి మరియు రాష్ట్ర గవర్నర్ కు పోస్ట్ చేశారని తెలిపారు. అనంతరం బిజెపి శాసనసభ పక్ష నేత పి.విష్ణుకుమార్ రాజు ను సీతమ్మధార లో ఆయన క్యాంప్ ఆఫీసులో కలిసి వినతిపత్రం సమర్పించారు.

తెలుగు దేశం పార్టీ కి దూరం : బి.వి.రామ్

అహంభావానికి ఆత్మగౌరవం మధ్య ఉండలేక తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నానని రామ్ తెలిపారు. వ్యక్తిగత ప్రయోజనాలు కంటే తెలుగుజాతి ప్రయోజనాలు నాకు ముఖ్యమని అన్నారు. నాపై దాడి జరిగి సంవత్సరం అయినా టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పళ్ళ వర్గాన్ని పై స్పందించలేని తెలుగు దేశం పార్టీ నాకొద్దని నేను దూరంగా ఉంటున్నాను అని తెలిపారు. ఏది ఏమైనా నిజాయితీగా పనిచేసే కార్యకర్తకు గుర్తింపు లేదని ఇప్పటికైనా కార్యకర్తలని మేలుకోమని రామ్ హేతువు పలికారు. ఎదిరించి వాడు లేకపోతే బెదిరించి వాడిది రాజ్యం అవుతుందని రామ్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ పప్పూర్ నికుంజ్, ప్రొఫెసర్ పెంటకోట త్రినాధరావు తదితరులు పాల్గొన్నారు.

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI

Next Story