Gambhiram: హరే కృష్ణ వైకుంఠంలో వైభవంగా కొనసాగుతున్న ఝులన్ యాత్ర

Gambhiram: ఐఐఎం రోడ్ గంభీరం హరే కృష్ణ వైకుంఠంలోని శ్రీ శ్రీ రాధా మదన మోహన్ మందిరంలో 4వ రోజు ఝులన్ సేవను భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 26 Aug 2026 11:58 PM IST
Gambhiram
X

Gambhiram: హరే కృష్ణ వైకుంఠంలో వైభవంగా కొనసాగుతున్న ఝులన్ యాత్ర

గంభీరం: ఝులన్ యాత్ర భాగముగా శ్రీ శ్రీ రాధా మధన మోహన్ మందిరములో 4 రోజు 26 ఆగష్టు 2026 బుధవారం సాయంత్రం 6 గంటలకు వైభోగముగా నిర్వహించడం జరిగింది. శ్రీ శ్రీ రాధా మధన మోహన్ విగ్రహాలను అందముగా అలంకరించి పూలతో అలంకరించి న ఉయ్యలతో ఉంచి భక్తులు స్వయంగా ఝులన్ సేవ చేయడం జరిగింది .

శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ వారి అందమైన ఉయ్యాల పండుగ అయిన ఝులన్ సేవ యొక్క దివ్య ఆనందాన్ని భక్తులు పొందడం జరిగింది .

ఈ కార్యక్రమములో శ్రీమాన్ నిష్క్రించిన భక్త దాస గారు ప్రెసిడెంట్ హరే కృష్ణ మూవ్మెంట్ వారు భక్తులకు ఝులన్ ఉత్సవం ప్రాముఖ్యతను తెలియచేయడం జరిగింది .

ఈ ఝులన్ ఉత్సవంలో 27 వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది అని రేపు 27 వ తేది ఝులన్ సేవ చివరి రోజు మరియు 28 వ తేది శ్రీ బలరామ పూర్ణిమ భక్తులు పాలుగుని భగవంతుని కృపకు పాత్రులు కాగలరని శ్రీ యదురాజా దాస గారు ఈ ప్రకటన ద్వారా తెలియచేయుచున్నారు .

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story