Madhurawada: చంద్రంపాలెం దుర్గాలమ్మ ఆలయంలో శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి అలంకరణ!

Madhurawada: మధురవాడ చంద్రంపాలెం దుర్గాలమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ లలితా త్రిపురసుందరీ దేవిగా అమ్మవారి అలంకరణ. ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకం, హోమం.

JAI RAM, MADURAWADA
Published on: 15 Oct 2026 7:06 PM IST
Madhurawada
X

Madhurawada: చంద్రంపాలెం దుర్గాలమ్మ ఆలయంలో శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి అలంకరణ!

Madhurawada: చంద్రంపాలెం జాతరగట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఐదో రోజు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృత, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించి, శ్రీ లలితా త్రిపురసుందరీ దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.

ఆలయ అర్చకులు పట్నాల హరిప్రసాద్ శర్మ, పట్నాల మూర్తి శర్మల బృందం ఆధ్వర్యంలో కుంకుమార్చనలు, బిల్వదళ పూజలు, రుద్రాభిషేకం, హోమం తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు బూరెలు, పులిహోర ప్రసాదాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పిళ్లా చంద్రశేఖర్, కమిటీ అధ్యక్షుడు పిళ్లా సూరిబాబు, ప్రధాన కార్యదర్శి నాగోతి తాతారావు, ఇతర కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

JAI RAM, MADURAWADA

JAI RAM, MADURAWADA