Araku: అరకు జనసేన సమస్యలపై పంచకర్ల రమేష్ బాబును కలసిన నేతలు!
Araku: స్థానిక సంస్థల సమన్వయ కమిటీ జాబితాపై జనసేన విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబుకు వినతి పంపిన అరకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ చెట్టి చిరంజీవి.
Araku: అరకు జనసేన సమస్యలపై పంచకర్ల రమేష్ బాబును కలసిన నేతలు!
Araku: జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు, గౌరవ శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారిని అరకు నియోజకవర్గ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ చెట్టి చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల విడుదలైన స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీ జాబితాలో పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా క్రియాశీలకంగా పనిచేస్తున్న అంకితభావం కలిగిన జనసైనికులకు తగిన అవకాశం దక్కలేదని కార్యకర్తల్లో వ్యక్తమవుతున్న ఆవేదనను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో నిరంతరం శ్రమిస్తూ, ప్రజల్లో పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్తూ, సంస్థాగత కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న కార్యకర్తలకు సముచిత గుర్తింపు, ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరాన్ని వివరించారు. అదే సమయంలో, సమన్వయ కమిటీలో నియమితులైన కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారం సైతం జిల్లా అధ్యక్షులు గారి దృష్టికి అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్లారు.
పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు న్యాయం జరగాలి!
పార్టీ కోసం కష్టపడే నిజమైన కార్యకర్తల సేవలను గుర్తించి, వారి శ్రమకు తగిన గౌరవం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ అంశాలను ప్రస్తావించినట్లు చెట్టి చిరంజీవి వివరించారు. కమిటీల ఏర్పాటు సమయంలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తల సేవలను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ అంశాలపై పంచకర్ల రమేష్ బాబు సానుకూలంగా స్పందిస్తూ, జనసైనికులు వ్యక్తం చేసిన ఆవేదనను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి, సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చెట్టి చిరంజీవితో పాటు అనంతగిరి మండల అధ్యక్షులు చెట్టం మురళి, అరకు జనసేన పార్టీ ఐటీ ఇన్‌చార్జ్ సమర్ధి నరేష్, చినలబుడు పంచాయతీ ఇన్‌చార్జ్ పంచాడి అభి, నందుల సుమిత్ర, అనంతగిరి మండలానికి చెందిన వీర మహిళ పాల్గొన్నారు.
జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా, క్షేత్రస్థాయిలో కష్టపడే ప్రతి జనసైనికుడికి తగిన గుర్తింపు, గౌరవం, అవకాశం దక్కాలన్నదే తమ ఆకాంక్ష అని నాయకులు పేర్కొన్నారు.




