Chintoor: క్రమశిక్షణతో లక్ష్యాన్ని సాధించాలి: డీఎఫ్‌ఓ రవీంద్రనాథ్‌రెడ్డి
Chintoor: చిన్న వయసు నుంచే స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదవాలని చింతూరు డీఎఫ్‌ఓ రవీంద్రనాథ్‌రెడ్డి విద్యార్థులకు మార్గదర్శనం చేశారు.
Chintoor: క్రమశిక్షణతో లక్ష్యాన్ని సాధించాలి: డీఎఫ్‌ఓ రవీంద్రనాథ్‌రెడ్డి
చింతూరు: విద్యార్థులు చిన్న వయసు నుంచే తమ భవిష్యత్తుకు ఓ లక్ష్యాన్ని పెట్టుకుని దాన్ని సాధించేందుకు క్రమశిక్షణతో కష్టపడి లక్ష్యాన్ని చేరుకోవాలనిచింతూరు డీఎఫ్‌ఓ రవీంద్రనాథ్‌రెడ్డి సూచించారు.
చింతూరులోని శ్రీ భాస్కర విద్యానికేతన్‌లో నిర్వహించిన మోటివేషన్ క్లాస్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో మాట్లాడారు.ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాల్లో స్థిరపడేందుకు ఇప్పటి నుంచే చదువు పై శ్రద్ధ పెట్టాలని సూచించారు.
సమయాన్ని వృథా చేయకుండా ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. మొబైల్ ఫోన్‌ను అవసరమైన మేరకే ఉపయోగించాలని డీఎఫ్‌ఓ సూచించారు.
ఎక్కువ సమయం ఫోన్‌లో గడపడం వల్ల చదువు పై ఆసక్తి తగ్గడంతో పాటు ఇతర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు.మొబైల్‌ను చదువుకు,విజ్ఞానం పెంచుకోవడానికి ఉపయోగించుకోవాలని చెప్పారు.
మాదక ద్రవ్యాలు జీవితాలను నాశనం చేస్తాయని,వాటికి అలవాటు పడితే ఆరోగ్యంతో పాటు భవిష్యత్తు కూడా దెబ్బతింటుందని వివరించారు.స్నేహితుల ఒత్తిడితోనైనా చెడు అలవాట్లకు లోనుకావద్దని విద్యార్థులకు సూచించారు.
చిన్న వయసులోనే మంచి అలవాట్లను అలవర్చుకుని క్రమశిక్షణతో చదువుకుంటే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చన్నారు.జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా లక్ష్యాన్ని పక్కన పెట్టకుండా పట్టుదలతో చదువుతూ ముందుకు సాగితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ చిరసాని వేణుగోపాల్‌రావు, ప్రిన్సిపాల్ వి. రాంబాబు, A.C.O చిరసాని త్రివీణ , ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.




