Chintoor: చింతూరు డిగ్రీ కాలేజీ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి: ఎస్ఎఫ్ఐ
Chintoor: చింతూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నిర్మాణాన్ని పూర్తి చేసి, పూర్తయిన గదులను కళాశాలకు అప్పగించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న కుమార్ డిమాండ్ చేశారు.
Chintoor: చింతూరు డిగ్రీ కాలేజీ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి: ఎస్ఎఫ్ఐ
చింతూరు: భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్.ఎఫ్.ఐ స్కూల్ బచావో కార్యక్రమం సందర్భంగా రాష్ట్రంలో అన్ని పాఠశాలలు,కళాశాలలు పరిశీలిస్తూ చింతూరు లో ఉన్నటి వంటి డిగ్రీ కాలేజి సందర్శించడం జరిగింది.
ఈ సందర్భంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఎస్.ఎఫ్.ఐ రాష్ట్ర కార్యదర్శి కె. ప్రసన్న కుమార్ మాట్లాడుతూ డిగ్రీ కాలేజీకి ఇప్పటికే నిర్మాణం చేసిన నూతన భవనం గదులు కాలేజీకి అప్పగించాలని అన్నారు.
మరో భవనం నిర్మాణానికి 5 కోట్ల నిధులు ప్రభుత్వం కేటాయించడం జరిగింది అన్నారు. త్వరగా కాలేజీ నిర్మాణం పూర్తి చేయాలని అలాగే పొలిటికల్ సైన్స్ కి అధ్యాపకులను కల్పించాలని,నూతన భవనం దగ్గర అమ్మాయిలకు మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
బాలుర హాస్టల్ పాత భవనం అవటంతో వర్షానికి నీరు కారుతుందని ఎప్పుడు పడిపోతుందో తెలియని పరిస్ధితిలో విద్యార్దులు బిక్కు బిక్కుమని ఉంటున్నారని అన్నారు.అమ్మాయిల హాస్టల్ లో త్రాగునీరు,వాడుక నీరు,వంట గది లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
తక్షణమే సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఐ రాష్ట్ర సహాయక కార్యదర్శి ప్రసాద్, రాష్ట్ర కమిటి సభ్యులు లోవరాజు, ఎస్.ఎఫ్. ఐ నాయకులు వై. భాస్కర్, క్రాంతి, గిరిజన సంఘం నాయకులు లక్ష్మణ్,సుబ్బారావు లు పాల్గొన్నారు.




