Chodavaram: గంజాయి కేసులో నిందితులకు 10 ఏళ్ల జైలు, రూ. లక్ష జరిమానా!
Chodavaram: అనకాపల్లి జిల్లా చోడవరం కోర్టు కీలక తీర్పు: గంజాయి స్మగ్లింగ్ కేసులో ఇద్దరు నిందితులకు 10 ఏళ్ల జైలు, రూ. లక్ష జరిమానా.
Chodavaram: గంజాయి కేసులో నిందితులకు 10 ఏళ్ల జైలు, రూ. లక్ష జరిమానా!
Chodavaram: అనకాపల్లి జిల్లా (చోడవరం ) గంజాయి అక్రమ రవాణాపై రాజీలేని పోరాటంలో భాగంగా, అనకాపల్లి జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ పోలీసు వారు సాక్ష్యాధారాలతో సహా పకడ్బందీగా నమోదు చేసిన కేసులో నిందితులకు శిక్ష పడింది. ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్,చోడవరం పరిధిలో 2016లో నమోదైన భారీ గంజాయి అక్రమ రవాణా కేసులో నేడు చోడవరం లోని 9వ అదనపు జిల్లా కోర్టు గౌరవ జడ్జి శ్రీ ఎం.హరి నారాయణ గారు సంచలన తీర్పు వెల్లడించారు.
కేసు వివరాలు
02 డిసెంబర్ 2016 న, దేవరపల్లి గ్రామం & మండలం శివారు వద్ద అప్పటి ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ Ch. V S. ప్రసాద్ మరియు సిబ్బంది వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో దేవరాపల్లి వైపు వస్తున్న ఒక టాటా ఇండికా (AP 35 P 4347) వాహనాన్ని తనిఖీ చేయగా, అందులో అక్రమంగా తరలిస్తున్న 144 కిలోల గంజాయిని గుర్తించారు. పోలీసులు వాహనాన్ని, గంజాయిని మరియు నిందితులను అదుపులోకి తీసుకుని NDPS చట్టం కింద కేసు నమోదు చేశారు.
శిక్ష పడిన నిందితులు:
A1 - అతవ అచ్చుతరావు, * (దేవరపల్లి, అనకాపల్లి జిల్లా )
A3 - ఓచ్చు విజయకుమార్ * (తమిళనాడు)
ప్రాసెక్యూషన్ తరపున అదనపు పబ్లిక్ ప్రాస్క్యూటర్ శ్రీ చీపురుపల్లి సూర్యనారాయణ గారు బలమైన సాక్ష్యాధారాలను కోర్టు ముందు ప్రవేశపెట్టారు. నేరం నిరూపితం కావడంతో, గౌరవ న్యాయమూర్తి నిందితులకు జైలు శిక్ష మరియు భారీ జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
నేరస్థులకు శిక్ష పడేలా సమర్థవంతంగా వాదనలు వినిపించిన అదనపు పబ్లిక్ ప్రాస్క్యూటర్ శ్రీ చీపురుపల్లి సూర్యనారాయణను, కేసును శాస్త్రీయ పద్ధతిలో దర్యాప్తు చేసిన నాటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ Ch.V.S. ప్రసాద్ , మరియు ప్రస్తుత ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్, చోడవరం ఇన్స్పెక్టర్ K. V. పాపునాయుడు, వారి సిబ్బందిని, కోర్టు మానిటరింగ్ సెల్ అధికారులను రాష్ట్ర ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ మ, IPS గారు ప్రత్యేకంగా అభినందించారని అనకాపల్లి జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ V. సుధీర్ గారు తెలియజేయడమైనది.
"మత్తు పదార్థాల రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో ప్రొవిబిషన్ మరియు ఎక్సైజ్ వారు ఎల్లప్పుడూ ముందుంటారని, ఈ తీర్పు అక్రమ వ్యాపారాలు చేసేవారికి ఒక హెచ్చరిక" అని DPEO,అనకాపల్లి జిల్లా అధికారి శ్రీ వి.సుధీర్ గారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.




