Chodavaram: చోడవరంలో విద్యార్థులతో ఎక్సైజ్ అధికారుల డ్రగ్-ఫ్రీ ప్రతిజ్ఞ
Chodavaram: చోడవరం నియోజకవర్గ కేంద్రంలోని ఉషోదయ కళాశాలలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు మత్తు పదార్థాల దుష్పరిణామాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Chodavaram: చోడవరంలో విద్యార్థులతో ఎక్సైజ్ అధికారుల డ్రగ్-ఫ్రీ ప్రతిజ్ఞ
చోడవరం: అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ కేంద్రంలో స్థానిక ఎక్సైజ్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో స్థానిక ఉషోదయ కళాశాల లో విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాదకద్రవ్యాల వినియోగం వల్ల ఆరోగ్యపరంగా, సామాజికంగా మరియు ఆర్థికపరంగా కలిగే నష్టాలను వివరించారు. ముఖ్యంగా యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని, స్నేహితుల ఒత్తిడికి లోనుకాకుండా తమ లక్ష్యాల సాధనపై దృష్టి సారించాలని సూచించారు.
మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తి జీవితాన్నే కాకుండా కుటుంబం మరియు సమాజంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని వివరించారు. డ్రగ్స్ వినియోగం మరియు అక్రమ రవాణాపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని, ప్రజలు కూడా సమాచారాన్ని ఎస్సైజ్ స్టేషన్ చోడవరo వారికి అందించి సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో డ్రగ్-ఫ్రీ సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ప్రొబిషన్ & ఎక్సైజ్ శాఖ ఎస్సైలు ఎం శేఖరం, కె.హనుమంతు మరియు సిబ్బంది పాల్గొన్నారు.




