Chodavaram: చోడవరంలో ఘనంగా వైఎస్సార్ 77వ జయంతి

Chodavaram: అనకాపల్లి చోడవరం నియోజకవర్గ కేంద్రంలోని వైసిపి కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు జరిగాయి.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 8 July 2026 12:30 PM IST
Chodavaram
X

Chodavaram: చోడవరంలో ఘనంగా వైఎస్సార్ 77వ జయంతి

Chodavaram: అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ కేంద్రం వైసిపి కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

గుడివాడ అమర్నాథ్ వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి సేవా కార్యక్రమాలు, పేదలకు పండ్లు, దుస్తులు పంపిణీ చేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి వైఎస్ రాజశేఖరరెడ్డిని స్మరించుకున్నారు.

అనంతరం మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ..

వైయస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలను చోడవరం నియోజకవర్గ పరిధిలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు కార్యకర్తలు జరుపుకుంటున్నారని. ఇంతటి మహోన్నత వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమానికి ఆధ్యుడుగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దారని తెలిపారు.

ఆరోగ్యశ్రీ నుండి ఫీజు రియంబర్స్మెంట్ కొరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్ర ప్రజల అభ్యున్నతకే నిర్వహించిన ఏకైక రాజకీయ నాయకుడు మాజీ ముఖ్యమంత్రిగా చరిత్రలో చిరస్థాయిగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నారని. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రతి పేదవాడి సొంతింటికలను అందులోనూ పార్టీలు కులాలు, మతాలకు అతీతంగా నెరవేర్చారని.

ఎందరో పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యం అందించిన ఘనత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి కి చెందుతుందని ఈ సందర్భంగా తెలిపారు. అలాంటి రాజశేఖర్ రెడ్డి ఆశయాలను పునికి పుచ్చుకున్న తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు రాజశేఖర్ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా కార్యక్రమాలు చేబడుతున్నాయని తెలిపారు.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM

Next Story