Chodavaram: చోడవరం మినర్వా స్కూల్‌లో ఇన్వెస్టిచర్ సెరిమనీ
Chodavaram: చోడవరం మినర్వా పాఠశాలలో విద్యార్థి నాయకులకు ఇన్వెస్టిచర్ సెరిమనీ నిర్వహించారు.
Chodavaram: చోడవరం మినర్వా స్కూల్‌లో ఇన్వెస్టిచర్ సెరిమనీ
Chodavaram: చోడవరం మినర్వా పాఠశాలలో విద్యార్థి నాయకత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో ఇన్వెస్టిచర్ సెరిమనీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చోడవరం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ అప్పల రాజు ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థి నాయకులుగా ఎన్నికైన వారికి బ్యాడ్జీలు అలంకరించి, నాయకత్వ బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా సి.ఐ. శ్రీ అప్పల రాజు మాట్లాడుతూ, విద్యార్థులు విద్యలోనే కాకుండా విలువలు, క్రమశిక్షణ, సేవాభావం, నాయకత్వ లక్షణాలను కూడా అలవర్చుకోవాలని సూచించారు. నేటి విద్యార్థులే రేపటి సమాజ నిర్మాణ శిల్పులని పేర్కొన్నారు.
పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి సూర్యకుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మినర్వా విద్యాసంస్థల వ్యవస్థాపకులు డి.వి.ఎస్. రాజు (రమేష్) గారు, డైరెక్టర్ శ్రీ అవినాష్ గారు, రత్న ఫంక్షన్ హాల్ అధినేత శ్రీ రాజా గారు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు.
ACO శ్రీమతి సాయి దుర్గ , లైజన్ ఆఫీసర్లు శ్రీ ప్రమోద్ వర్మ గారు, శ్రీ గోవింద్ గారు, అలాగే పీ.ఈ.టీ. శ్రీ గోవింద్ గారి పర్యవేక్షణలో విద్యార్థుల ఆకట్టుకునే పరేడ్ నిర్వహించబడింది.
తల్లిదండ్రుల తరఫున శ్రీమతి దొడ్డి అరుణకుమారి గారు మాట్లాడుతూ, విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న మినర్వా యాజమాన్యం, ఉపాధ్యాయులు మరియు సిబ్బందిని అభినందించారు.
చివరగా శ్రీమతి శరగడం సముద్రిక గారు వందన సమర్పణ చేయగా, కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.




