Chodavaram: గుడ్డిప - రావికమతం నూతన రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే!
Chodavaram: గుడ్డిప నుండి రావికమతం నూతన రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన చోడవరం ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు. మెరుగైన ప్రయాణ సౌకర్యాలే లక్ష్యమని వెల్లడి.
Chodavaram: గుడ్డిప - రావికమతం నూతన రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే!
Chodavaram: ప్రజల ప్రయాణ సౌలభ్యం, రవాణా భద్రత సాధించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని చోడవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కేఎస్‌ఎన్‌ఎస్ రాజు స్పష్టం చేశారు. గుడ్డిప నుండి రావికమతం వరకు గత కొంతకాలంగా తీవ్రంగా దెబ్బతిని, గుంతలమయంగా మారిన రోడ్డును బాగు చేయాలని స్థానిక ప్రజలు, ప్రయాణికులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.
స్థానికుల విజ్ఞప్తులపై ఎమ్మెల్యే తక్షణమే స్పందించి, ఆ మార్గంలో నూతన రోడ్డు నిర్మాణ పనులను అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు మాట్లాడారు. గతంలో రహదారి అధ్వానంగా ఉండటం వల్ల గర్భిణీలు, విద్యార్థులు, నిత్యం ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు.
ప్రజల కష్టాలను తీర్చేందుకు ఈ రోడ్డు నిర్మాణ పనులను అత్యంత నాణ్యతా ప్రమాణాలతో, త్వరితగతిన పూర్తి చేయిస్తున్నట్లు హామీ ఇచ్చారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరం ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రాజాన కొండ నాయుడు,ఎంపీటీసీ గంజి సూర్యనారాయణ,ex ఎంపీటీసీ బంటు శ్రీను,ప్రభుత్వ అధికారులు DEE నర్సం మూర్తి గారు,మజ్జి అప్పారావు,మండల itdp అధ్యక్షులు గల్లా నాని బాబు మరియు పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు.




