Anakapalle: స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు పట్టం కట్టాలని పిలుపు
Anakapalle: అనకాపల్లి జిల్లా చోడవరంలో కూటమి ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు తెలిపారు.
Anakapalle: స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు పట్టం కట్టాలని పిలుపు
Anakapalle: అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధిని చూసి కూటమి అభ్యర్థులను ఆదరించాలని పిలుపునిచ్చారు.
చోడవరంలోని తన క్యాంపు కార్యాలయంలో జనసేన ఇన్చార్జి పీవీఎస్ఎన్ రాజు, బీజేపీ నేత ఈర్లె శ్రీరామమూర్తిలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
రెండున్నరేళ్ల కూటమి పాలనలో ఉత్తరాంధ్రలో పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించామని ఎమ్మెల్యే తెలిపారు. గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతుల బకాయిలు 28 కోట్ల రూపాయలను కూటమి ప్రభుత్వం విడుదల చేసి రైతుల పట్ల చిత్తశుద్ధిని చాటుకుందన్నారు.
రావికమతం మండలంలోని మారుమూల గిరిజన గ్రామం చలిసింగానికి రోడ్డు వేయించామని, చోడవరంలో విత్తన గిడ్డంగి, రైతు బజారు, రెవెన్యూ కాంప్లెక్స్ నిర్మాణాలను పూర్తి చేశామని, ఇది కేవలం కూటమి ప్రభుత్వానికే సాధ్యమైందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జనసేన ఇన్చార్జి పీవీఎస్ఎన్ రాజు మాట్లాడుతూ.. రైతుల బకాయిలు ఇవ్వడంతోనే తమ బాధ్యత తీరిపోలేదన్నారు. ఏ విధంగా బకాయిలు సాధించామో, అదే విధంగా కూటమి నేతలందరం కలిసి గోవాడ ఫ్యాక్టరీని తిరిగి తెరిపించే బాధ్యతను కూడా భుజాన వేసుకుంటామని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధి, ముఖ్యంగా బీఎన్ రోడ్డు సమస్యలను త్వరలో పరిష్కరిస్తామన్నారు.
బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ ఈర్లె శ్రీరామమూర్తి మాట్లాడుతూ..... చోడవరం నియోజకవర్గానికి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా సాగునీరు అందించేందుకు ప్రధాని మోదీ, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అనకాపల్లి జిల్లాకు కూటమి పాలనలో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. నియోజకవర్గ భవిష్యత్తు కోసం స్వార్థం లేకుండా టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులన్నీ ఐక్యంగా పనిచేసి స్థానిక ఎన్నికల్లో విజయం సాధిస్తామని ముగ్గురు నేతలు ధీమా వ్యక్తం చేశారు.




