Chodavaram: సీఎం చంద్రబాబును కలిసిన చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు
Chodavaram: చోడవరం షుగర్ ఫ్యాక్టరీ బకాయిలు రూ.43 కోట్లు, బీఎన్ రోడ్ విస్తరణకు రూ.124 కోట్లు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబును కోరిన ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు.
Chodavaram: సీఎం చంద్రబాబును కలిసిన చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు
Chodavaram: చోడవరం నియోజకవర్గ అభివృద్ధి, రైతులు–ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు నాయుడుని కలిసిన చోడవరం శాసన సభ్యులు శ్రీ కేఎస్ఎన్‌ఎస్ రాజు.
మాడుగుల నియోజకవర్గంలోని ఏ.కోడూరు గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని చోడవరం శాసన సభ్యులు శ్రీ కేఎస్ఎన్‌ఎస్ రాజు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా చోడవరం నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి కి ఎమ్మెల్యే వినతిపత్రం అందజేశారు.
చోడవరం కో-ఆపరేటివ్ షుగర్స్ లిమిటెడ్‌కు రూ.43 కోట్లు మంజూరు చేయాలని వినతి.
గోవాడ చోడవరం కో-ఆపరేటివ్ షుగర్స్ లిమిటెడ్కు సంబంధించి రైతులు, ఫ్యాక్టరీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పెండింగ్ బకాయిల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.43 కోట్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను కోరారు.
రూ.43 కోట్లలో,
రూ.28 కోట్లు – చెరకు రైతులకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిల చెల్లింపులకు,
రూ.15 కోట్లు – ఫ్యాక్టరీ ఉద్యోగుల జీతాలు, VRS బకాయిలు మరియు ఇతర పెండింగ్ బకాయిల చెల్లింపులకు
కేటాయించాలని కోరారు.
చోడవరం కో-ఆపరేటివ్ షుగర్స్‌పై ఆధారపడుతున్న వేలాది మంది రైతులు, ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిధులను మంజూరు చేసి సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారిని కోరారు.
బీఎన్ రోడ్ విస్తరణ మరియు రెండు వంతెనల నిర్మాణానికి రూ.124 కోట్ల ప్రతిపాదన
అలాగే బీఎన్ రోడ్ విస్తరణ మరియు రహదారి నిర్మాణంతో పాటు వడ్డాది, విజయరామరాజుపేట వద్ద రెండు వంతెనల నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు మరో వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ మొత్తం అభివృద్ధి పనులకు సుమారు రూ.124 కోట్ల అంచనా వ్యయం ఉంటుందని, ఈ రహదారి మరియు వంతెనల నిర్మాణం పూర్తయితే చోడవరం నియోజకవర్గంలోని ప్రజలకు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడటంతో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఎమ్మెల్యే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
నియోజకవర్గ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ రెండు కీలక అంశాలకు త్వరితగతిన ఆమోదం, నిధుల మంజూరు చేయాలని ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను కోరారు.




