Anakapalli: చోడవరంలో బైక్ చోరీ ముఠా గుట్టురట్టు.. నలుగురు నిందితులు అరెస్ట్!
Anakapalli: అనకాపల్లి జిల్లా చోడవరంలో అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠా అరెస్ట్. నలుగురు నిందితుల నుంచి 6 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు.
Anakapalli: చోడవరంలో బైక్ చోరీ ముఠా గుట్టురట్టు.. నలుగురు నిందితులు అరెస్ట్!
Anakapalli: అనకాపల్లి జిల్లాలో బైక్ చోరీలకు చెక్ పడింది. వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను అనకాపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. చోడవరం, నర్సాపురం గ్రామం దగ్గర 4 మంది నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుండి 6 బైకులను స్వాధీనం చేసుకున్నారు.
అనకాపల్లి జిల్లా చోడవరం మండలం నరసాపురం గ్రామ దగ్గరలోని K.కోటపాడు వైపు నుండి వెంకన్నపాలెం జంక్షన్ వైపు వస్తున్న మెయిన్ రోడ్డుపై నలుగురు అనుమానాస్పదంగా తిరుగుతుండటం గమనించిన చోడవరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు.
విచారణలో వారు అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠాగా తేలింది. వీరు అనకాపల్లి, శ్రీకాకుళం, ఏలూరు, గుంటూరు జిల్లాల్లో మొత్తం 6 కేసుల్లో బైక్ దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. నిందితుల నుండి 6 బైకులను పోలీసులు రికవరీ చేశారు.
స్వాధీనం చేసుకున్న బైకుల్లో Pulsar 125, Pulsar NS 125, Pulsar 150, Royal Enfield Classic 350, Splendor Plus -2 ఉన్నాయి. ఈ బైకులు చోడవరం, కోటపాడు, తాడేపల్లి, ఏలూరు టూ టౌన్, J R పురం పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీకి గురైనవిగా గుర్తించారు.
నిందితుల వివరాలు
1. బోసెట్టి కార్తీక్, 19 ఏళ్లు, సేమునాపల్లి గ్రామం, చోడవరం మండలం
2. 2. మరిశెట్టి కార్తీక్, 19 ఏళ్లు, నాయుడు తోట, విశాఖపట్నం 3. కొండపల్లి సూర్య, 19 ఏళ్లు, రాజువీధి, చౌడవాడ గ్రామం
4. మాత S/o పైడిరాజు, 23 ఏళ్లు, ఇందిరమ్మ కాలనీ, చౌడవాడ గ్రామం
నిందితులు నలుగురు చెడు వ్యసనాలకు అలవాటు పడి, మద్యం, గంజాయి వంటి వాటి కోసం బైక్ లను చోరీ చేసి, తక్కువ ధరకు అమ్ముతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నర్సాపురం దగ్గరలోని కోటపాడు నుండి వెంకన్నపాలెం వెళ్లే రోడ్డు మీద నలుగురు ముద్దాయిల దగ్గర ఉన్న రెండు బైకులు, దీమనపల్లి శివారులోని గోపాలస్వామి గుడి దగ్గరలో ఉన్న పొదల్లో మిగతా నాలుగు బైకులను స్వాధీనం చేసుకున్నారు.
ఇలాంటి సంఘటనలు ప్రజల్లో భయం కలిగించకుండా, అప్రమత్తతతో ఉండాలని సూచిస్తున్నాము. అనుమానాస్పద వ్యక్తులను ప్రశ్నించడం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, నేరాలపై కఠినంగా వ్యవహరించడమే కాకుండా యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాము అని DSP తెలిపారు.
ఈ కేసును జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, IPS గారి ఆదేశాలతో, అడిషనల్ ఎస్పీ వై.ఎల్.మోహనరావు పర్యవేక్షణలో, DSP పి.వి.నరసింహారావు సూచనలతో చోడవరం ఇన్ స్పెక్టర్ అప్పలరాజు, SI నాగ కార్తీక్, సిబ్బంది చాకచక్యంగా ఛేదించారు.




