Chodavaram: ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ద్వారా జపాన్టూర్ కి ఎంపికైన గుణశ్రీ కీర్తి

Chodavaram: అనకాపల్లి జిల్లా లక్ష్మీపురం ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని గుణ శ్రీ కీర్తి ఇన్స్పైర్ మనక్ సైన్స్ ఫెయిర్‌లో జాతీయ స్థాయిలో మొదటి స్థానం సాధించింది.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 23 May 2026 2:03 PM IST
Chodavaram
X

Chodavaram: ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ద్వారా జపాన్టూర్ కి ఎంపికైన గుణశ్రీ కీర్తి

చోడవరం: అనకాపల్లి జిల్లా చోడవరం మండలం లక్ష్మీపురం జిల్లా పరిషత్ పాఠశాల కు చెందిన గుణ శ్రీ కీర్తి అనే విద్యార్థిని ఇన్స్పైర్ మనక్ సైన్స్ ఫెయిర్ లో మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి లలో మొదటి స్థానంలో నిలిచి జాతీయస్థాయిలో కూడా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుని తన సత్తా చాటింది. స్థానిక లక్ష్మీపురం ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థిని ఈ ఘనత సాధించడంతో స్థానిక ప్రజానీకం మరియు ఉపాధ్యాయులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇన్స్పైర్ మనక్ అనే కార్యక్రమంలో ఉల్లి రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆనియన్ ప్రిజర్వేషన్ పై తన ప్రాజెక్టును తయారుచేసి ఈ పోటీల్లో విజయం సాధించింది. ముఖ్యంగా ఉల్లి రైతులకు పంట ఎక్కువగా ఉన్నప్పుడు మంచి ధర పలకకపోవడం, మంచి ధర వచ్చేవరకు వేచి చూద్దాం అంటే ఉల్లి పంట నిలువ చేయడం కుదరకపోవడం వలన ఉల్లి పంటను అమ్మడంలో ఇబ్బందులు పడుతూ ఉన్నారని అందువలన తన ఆనియన్ ప్రిజర్వేషన్ ప్రాజెక్టులో కనీసం తొమ్మిది నెలల పాటు రైతు తన పంటను ప్రీజర్వ్ చేసుకోవచ్చని విద్యార్థిని గుణ శ్రీ కీర్తి తెలిపారు.

స్థానిక ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ రాజు మాట్లాడుతూ ఎంత చిన్న వయసులో రైతుల కు మేలు కలిగించే విధంగా ప్రాజెక్టు తయారు చేసిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని గుణ శ్రీ కీర్తి ఈ ఘనత సాధించడం ద్వారా నిజంగా చోడవరం పేరును జాతీయస్థాయిలో నిలబెట్టారని కొనియాడారు.... ఈ ప్రాజెక్టు ద్వారా రైతులకు మేలు కలిగే విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్లి రైతులకు అందుబాటులో వచ్చే విధంగా కృషి చేస్తానని తెలిపారు

అదేవిధంగా జపాన్ టూర్ కు సెలెక్ట్ అవడం తనకు నిజంగా ఆనందాన్నిచ్చిందని విద్యార్థిని గుణ శ్రీ కీర్తి తో పాటు తనకు తోడ్పాటు అందించిన తన ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేసింది. స్థానిక నాయకులు చిన్న బాబు మాట్లాడుతూ ఇన్ని కార్పొరేట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ పార్టిసిపేట్ చేసిన ఒక ప్రభుత్వ పాఠశాల నుంచి విద్యార్థిని ఈ ఘనత సాధించడం నిజంగా తమ గ్రామానికి చాలా గొప్ప విషయమని గుణ శ్రీ కీర్తి మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెలిపారు.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM

Next Story