Chodavaram: మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి!

Chodavaram: మధ్యాహ్న భోజన పథకం కార్మికుల 3 నెలల పెండింగ్ బిల్లులు, వేతనాలు చెల్లించాలి. చోడవరంలో రాష్ట్ర అధ్యక్షురాలు గూనూరు వరలక్ష్మి హెచ్చరిక.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 13 Sept 2026 1:18 PM IST
Chodavaram
X

Chodavaram: మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి!

Chodavaram: అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ కేంద్ర లో గూనూరు వరలక్ష్మి మాట్లాడుతూ జూన్ నుండి మూడు నెలలుగా బిల్లులు వేతనాలు బకాయిలు ఉన్నాయని, లక్షల రూపాయలు పెట్టుబడి మహిళలు ఎలా పెట్టగలరని ఆమె ప్రశ్నించారు. ప్రతి నెల బకాయి బిల్లులు చెల్లించకపోతే పిల్లలకు ఎక్కడ నుండి అప్పులు తెచ్చి పెట్టాలని అన్నారు.

కిరాణా షాపుల్లో అప్పులు పేరుకుపోయి మానసిక ఆందోళనకు కార్మికులు గురవుతున్నారని, ఈ పథకంలో పని చేస్తున్న మహిళలు పేద మహిళని ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. రకరకాల మెనూలు పేరుతో మధ్యాహ్న భోజన కార్మికులను అప్పుల ఊబిలో ఊరుకుపోయిన ఏ పూట పిల్లలకు భోజనం ఆపలేదని, కానీ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులను గుర్తించడంలో వాళ్ల సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యిందని ఆమె అన్నారు.

మధ్యాహ్న భోజన కార్మికులపై భారం మోపి లక్షల రూపాయలు ప్రభుత్వం దగ్గర ఉంచుకుంటే పెట్టుబడి ఎక్కడి నుండి తెచ్చి పెట్టాలని ఆమె అన్నారు. ప్రతి స్కూల్లో మౌలిక వసతులు కల్పించాలని, వాటర్ సదుపాయం, వంటషెడ్లు నిర్మించాలని, రాజకీయ వేధింపులు అక్రమ తొలగింపులు ఆపాలని, కనీస వేతనాలు అమలు చేయాలని ఆమె అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మూడు నెలల బకాయి బిల్లులు, వేతనాలు వెంటనే చెల్లించాలని లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తా మని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM