Chodavaram: రాష్ట్రంలో శాంతిభద్రతలు ఫెయిల్.. డైవర్షన్ పాలిటిక్స్ ఆపండి
Chodavaram: అనకాపల్లి జిల్లా చోడవరం వైసీపీ కార్యాలయంలో మహిళా నేతలు మీడియా సమావేశం నిర్వహించారు.
Chodavaram: రాష్ట్రంలో శాంతిభద్రతలు ఫెయిల్.. డైవర్షన్ పాలిటిక్స్ ఆపండి
చోడవరం: అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ కేంద్రం లో వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీకి చెందిన మహిళ నేతలు మాట్లాడుతూ మొట్టమొదట మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ను వాడు వీడు అంటూ, పానీ పూరి బండిలు ప్రారంభోత్సవాలు చేసిన గుడ్డు మంత్రి అని హోం మంత్రి అనిత మాట్లాడటం వల్లే గుడివాడ అమర్నాథ్ ఆమె మేకప్ గురించి మాట్లాడారని.
అందులో తప్పేముందని ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేక స్థానిక షుగర్ ఫ్యాక్టరీని పున ప్రారంభించలేక ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతూ గుడివాడ అమర్నాథ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అమర్నాథ్ చిత్రపటాన్ని కోడిగుడ్లతో కొట్టి అవమానపరచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా స్థానిక ఎంపీపీ గాడి కాసు తెలిపారు. రాష్ట్రంలో హోం శాఖ ఫెయిల్ అయిందని ముందు తన శాఖ పైన దృష్టి పెట్టాలని హోమ్ మినిస్టర్ కు హేతువు పలికారు
మహిళా నేత బగ్గు శ్యామల మాట్లాడుతూ
తూర్పుగోదావరి జిల్లాలో జ్ఞానేశ్వరి అనే పాప మిస్సయి నేటి 20 రోజులు దాటిందని ఆ విషయంలో హోం మంత్రి ఏం చేశారని, అదేవిధంగా సాయి కృష్ణ అనే యువకుడు మిస్ అయి దాదాపు పది రోజులు అయింది అని ఆఖరికి వారి తల్లిదండ్రులు హెబీఎస్ కార్పస్ రిట్ వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని రాష్ట్రంలో శాంతి భద్రతల కరువయ్యాయని ఈ సందర్భంగా ఆరోపించారు.
హోం మంత్రి అనితకు కనీసం గుడివాడ అమర్నాథ్ పేరు ఎత్తే అర్హత కూడా లేదని గుడివాడ అమర్నాథ్ తాతల నుంచి రాజకీయంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు కుటుంబమని. అలాంటి వ్యక్తిపై మాట్లాడే హక్కు కూడా హోం మంత్రి అనితకు లేదని ఈ సందర్భంగా తెలిపారు..
అనకాపల్లి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్ మాట్లాడుతూ.. తాము ఎప్పుడూ హుందాగానే రాజకీయాలు చేశామని ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక ఇలా డైవర్షన్ పాలిటిక్స్ కి పాల్పడి ఇలాంటి చర్యలు హేయనీయం అని తెలిపారు...
స్థానిక వైసీపీ నాయకుడు చందు రాంబాబు మాట్లాడుతూ
చోడవరం నియోజకవర్గంలో రాజకీయాలు మాటలు వరకే ఉండేవని కానీ నిన్న నియోజకవర్గంలో లేని సంస్కృతిని తీసుకువచ్చారని కోడిగుడ్లతో మాజీ మంత్రి అమర్నాథ్ చిత్రపటానికి కొట్టారని ఇలాంటి పరిస్థితులు తాము ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఇలాంటి చర్యలను ఆపకపోతే వైసీపీలో కూడా ఝాన్సీ లక్ష్మీబాయిలా ఎదిరించి పోరాడే మహిళా విభాగం ఉందనే విషయాన్ని టిడిపి గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరించారు.




