Anandapuram: జల సహకారంతోనే మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణం: సీఐ కల్యాణి
Anandapuram: విశాఖపట్నం సిటీ పోలీస్ ఈగల్ టీం ఆధ్వర్యంలో ఆనందపురం మండలం బోని గ్రామంలో "పల్లెబాటలో ఈగిల్" కార్యక్రమం నిర్వహించారు.
Anandapuram: జల సహకారంతోనే మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణం: సీఐ కల్యాణి
ఆనందపురం: ఆనందపురం మండలం బోని గ్రామంలో పల్లెబాట కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం సిటీ పోలీస్ ఈగల్ టీం ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ పై గ్రామస్థుల భాగస్వామ్యంతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆనందపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ వివిఎస్ఎం. ఎర్రం నాయుడు మాట్లాడుతూ గ్రామస్థులకు గంజాయి, మద్యం ఇతర మాదక ద్రవ్యాల వినియోగం వల్ల వ్యక్తిగతంగా, కుటుంబపరంగా అలాగే సమాజానికి కలిగే తీవ్ర దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు.
ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితులలో యువకులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు.అలాగే గంజాయి, మాదక ద్రవ్యాల సాగు, రవాణా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టడంలో ప్రజలు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరారు.
అనంతరం ఈగల్ టీం సర్కిల్ ఇన్స్పెక్టర్ టి. కళ్యాణి మాట్లాడుతూ ప్రజలు మత్తు మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు పోలీసులకు సహకరించాలని మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ప్రజల సహకారంతోనే మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు.ఈ సందర్భంగా గ్రామస్థులు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తున్న విశాఖపట్నం సిటీ పోలీస్, ఈగిల్ బృందం చేపడుతున్న కార్యక్రమాలను అభినందిస్తూ, పోలీసులకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.




