Chodavaram: అక్టోబర్ 6న ఆశా డే బహిష్కరణ: సీఐటీయూ పిలుపు
Chodavaram: న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ అక్టోబర్ 6న ఆశా డేను బహిష్కరిస్తున్నట్లు రావికమతంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి సత్యవతి తెలిపారు.
Chodavaram: అక్టోబర్ 6న ఆశా డే బహిష్కరణ: సీఐటీయూ పిలుపు
అనకాపల్లి జిల్లా: చోడవరం నియోజకవర్గ పరిధిలోని రావికమతం మండలంలో తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కానందున అక్టోబర్ 6 ఆశా డేను బహిష్కరిస్తున్నట్లుగా సిఐటియు జిల్లా కార్యదర్శి వజ్రపు సత్యవతి తెలిపారు.
సందర్భంగా ఆశా కార్యకర్తలతో కలిసి రావికమతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలికి బహిష్కరణ నోటీసును అందజేశారు సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆశ వర్కర్లు చాలా సంవత్సరాలుగా తమ న్యాయమైన కోరికల కోసం పోరాటం చేస్తున్నామని ప్రభుత్వం నేటికీ వాటిని అమలు చేయకపోవడం దురదృష్టకరమని అందుకు నిరసనగా రేపు జరప తలపెట్టిన ఆశాడేను బహిష్కరిస్తున్నట్లుగా తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు ముఖ్య నేతలకు మంత్రులకు ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వనున్నామని ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆశా కార్యకర్త అంతా మంగళవారం పాల్గొనాలని కోరుతున్నట్లుగా తెలిపారు.
అదేవిధంగా ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లు కనీస వేతనాలు చెల్లింపు, పెర్మనెంట్ చేయాలని కమ్యూనిటీ హెల్త్ వర్కర్లని ఆశలుగా గుర్తించాలని అన్ని రకాల సెలవులు మంజూరు చేయాలని ఆశా నియామకాలు ప్రభుత్వమే చేపట్టాలని నాణ్యమైన మొబైల్స్ యూనిఫారాలు ఇవ్వాలని ఏసీ కి వెళ్లే ప్రతిసారి టిఎడిఏ చెప్పాలని గ్రాడ్యుటీకి సీలింగ్ ఎత్తివేయాలని ఏఎన్ఎం జిఎన్ఎం శిక్షణ పొందిన వారికి పర్మినెంట్ పోస్టుల నియామకాలు ప్రాధాన్యత ఇవ్వాలని దహన సంస్కార ఖర్చులు ప్రభుత్వమే భ రించాలని తదితర డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నట్లుగా తెలిపారు. కార్యక్రమంలో లక్ష్మి భ్రమరాంబిక సంధ్యా శంకరి తదితరులు హాజరయ్యారు.




