Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సు ప్రారంభం.. ఏపీ పెవిలియన్‌ను ప్రారంభించిన నేతలు!
Visakhapatnam: విశాఖపట్నంలో సీఐఐ భాగస్వామ్య సదస్సును ప్రారంభించిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి పీయూష్ గోయల్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్; ఘనస్వాగతం పలికిన కళాకారులు.
Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సు ప్రారంభం.. ఏపీ పెవిలియన్‌ను ప్రారంభించిన నేతలు!
Visakhapatnam: సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి పీయూష్ గోయల్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
థింసా, తప్పెటగుళ్లు, గరగ నృత్యంతో డప్పులతో అతిధులకు స్వాగతం పలికిన కళాకారులు. డోలు కళాకారులను ఉత్సాహరిచిన సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
వివిధ కళా బృందాల వద్దకు వెళ్లి కళాకారులతో ఫొటోలు దిగిన చంద్రబాబు, పీయూష్, పవన్ కళ్యాణ్. ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుద్ధ్య కార్మికులను అభినందించి ఫొటోలు దిగిన సీఎం, డిప్యూటీ సీఎం.
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌తో కలిసి ఏపీ పెవియన్, ఎంఎస్ఎంఈ పెవిలియన్ ప్రారంభించిన కేంద్ర మంత్రి, సీఎం, డిప్యూటీ సీఎం.
ఏ ప్రాంతాల్లో ఏయే పంటలు పడుతున్నాయి. ఏయే పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఉందనే విషయాన్ని ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డిజిటిల్ స్క్రీన్ చూపుతూ కేంద్రమంత్రికి వివరించిన మంత్రి నారా లోకేష్.
వివిధ రంగాల్లో ఏపీ అభివృద్ధికి చెందిన గ్రోత్ స్టోరీలను కేంద్ర మంత్రికి వివరించిన సీఎం చంద్రబాబు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్.. సోలార్ విద్యుత్ ప్లాంట్ల అభివృద్ధి... దేశాభివృద్ధికి ప్రధాని చేసిన సూచనలను డిజిటల్ స్క్రీన్స్ మీద ప్రదర్శించిన అధికారులు.




