Palasa: 27 మంది లబ్ధిదారులకు రూ19.62 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
Palasa: పలాస నియోజకవర్గంలో 27 మంది లబ్ధిదారులకు రూ.19.62 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గౌతు శిరీష.
Palasa: 27 మంది లబ్ధిదారులకు రూ19.62 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
Palasa: పలాస నియోజకవర్గ ప్రజలకు వైద్యపరంగా ఆర్థిక భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం అందిస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష లబ్ధిదారులకు అందజేశారు.
పలాసలోని గౌరవ ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని 27 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 19,62,767/- విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష మాట్లాడుతూ, “అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో అండగా నిలుస్తోంది.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్య చికిత్సకు ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తాం” అని తెలిపారు.
ప్రజల ఆరోగ్యం, సంక్షేమం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తోందని, అవసరమైన సందర్భాల్లో అర్హత కలిగిన వారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందే సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో ఆయా మండలా ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.




