Anakapalli: ఆదివారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్.. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్!
Anakapalli: రెండో దశ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మునగపాకలోని పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్ తనిఖీ చేసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Anakapalli: ఆదివారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్.. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్!
Anakapalli: రెండో దశ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిబంధనావళికి లోబడి, తమకు కేటాయించిన విధులను ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా నిర్వహించాలని స్పష్టం చేశారు.ఈ నెల 29న జిల్లాలోని ఎనిమిది మండలాల్లో జరగనున్న రెండో దశ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శనివారం మునగపాక మండలంలో కలెక్టర్ పర్యటించారు. రాజీవ్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేసి, ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా రూట్ అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్.. పోలింగ్ సామాగ్రి పంపిణీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఉదయం 7 గంటల నుంచి పోలింగ్మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్!రెండో దశ ఎన్నికల్లో భాగంగా ఆదివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభించి, మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించాలని రిటర్నింగ్ అధికారులకు స్పష్టం చేశారు.ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశను అప్రమత్తంగా పర్యవేక్షించాలని, విధుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్, జిల్లా పరిషత్ సీఈఓ సత్యనారాయణ, రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.




