Visakhapatnam: జీవీఎంసీ ఎన్నికల వ్యూహాలపై విశాఖ కాంగ్రెస్ పార్టీ సమావేశం

Visakhapatnam: మహిళలకు 33% టికెట్ల కేటాయింపుపై ఏపీసీసీ ఉపాధ్యక్షుడు వేగి వెంకటేష్, డీసీసీ అధ్యక్షుడు అడ్డాల వెంకట వర్మ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.

SHIVA, BHIMILI
Published on: 27 Aug 2026 7:50 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: జీవీఎంసీ ఎన్నికల వ్యూహాలపై విశాఖ కాంగ్రెస్ పార్టీ సమావేశం

విశాఖపట్నం: విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహల పై జిల్లా కమిటీ ఆ పార్టీ కార్యాలయంలో భేటీ అయింది. ఈ సమావేశం ఏపీసీసీ ఉపాధ్యక్షుడు వేగి వెంకటేష్ ఆధ్వర్యంలో డీసీసీ అధ్యక్షుడు అడ్డాల వెంకట వర్మ అధ్యక్షతన జరిగింది.

సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలను తమ అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. మహిళలకు, యువతకు ప్రాధాన్యత ఇస్తామని, 33% మహిళలకు టిక్కెట్లు కేటాయిస్తామని.

రాష్ట్ర ఏపీసీసీ ఉపాధ్యక్షులు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణకు వ్యతిరేకంగా , విశాఖ జిల్లాలో విభజన హామీల అమలు, డ్రగ్స్ రహిత విశాఖగా, శానిటేషన్, నగర అభివృద్ధి, యువతకు స్టార్టప్ సెంటర్ల నిర్వహణ వంటి కీలక అంశాలతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్తుందని ఆయన అన్నారు.

యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రామారావు మాట్లాడుతూ అత్యధికంగా యువతకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు కేటాయిస్తుందని, నగరంలో ఉన్న యువత ఉపాధి అవకాశాలు దొరకక పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారని, చాలా అభివృద్ధి చేసేసాం అని కూటమి ప్రభుత్వం చెప్తున్న యువతకు ఉపాధి దొరకట్లేదని, నగరపాలక సంస్థ ఎన్నికలలో యువత కాంగ్రెస్ అభ్యర్థులుగా విజయం సాధించి కౌన్సిల్ లో గళం విప్పుతారని ఆయన అన్నారు.

డీసీసీ అధ్యక్షులు అడ్డాల వెంకట వర్మ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు విశాఖ చాలా అభివృద్ధి చెందిందని, తరువాత ప్రభుత్వాలు విశాఖ నగర అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన అన్నారు.

కార్యక్రమంలో జిల్లా కార్యానివాహక కార్యదర్శి గౌతమ్, రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి సోడాదశి సుధాకర్,మాజీ నగర అధ్యక్షుడు పిరిడి భగత్,జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనంద్,విశాఖ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి, దక్షిణ నియోజకవర్గ ఇంచార్జ్ కేవీ సూర్యనారాయణ, భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్ రామకృష్ణ, ప్రచార కమిటీ కార్యదర్శి సంతోష్, కస్తూరి వెంకట్ రావు తదితరులు పాల్గొన్నారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story