Anakapalli: అనకాపల్లి జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం!
Anakapalli: అనకాపల్లి జిల్లాలో సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం. చాలాకాలంగా వానల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ వర్షం ఎంతో ఊరటనిచ్చి, ఆనందాన్ని నింపింది.
Anakapalli: అనకాపల్లి జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం!
Anakapalli: అనకాపల్లి జిల్లాలో సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి మోస్తరు నుంచి భారీ వర్షం పడుతుండటంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది.
కొంతకాలంగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ వర్షం ఊరటనిచ్చింది. పొలాల్లో సాగు పనులకు వర్షం అనుకూలంగా ఉంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నాళ్లకు వానదేవుడు కరుణించాడంటూ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వర్షాలతో చెరువులు, కాలువల్లోకి నీరు చేరే అవకాశం ఉండటంతో సాగునీటి సమస్య కొంతవరకు తగ్గుతుందని రైతులు భావిస్తున్నారు. మరోవైపు, ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.




