Visakhapatnam: మింది జెడ్పీ హైస్కూల్ భవన నిర్మాణానికి కోరమాండల్ రూ.23 లక్షల సాయం!

Visakhapatnam: విశాఖపట్నం జీవీఎంసీ 84వ వార్డు పరిధిలోని మింది జెడ్పీ ఉన్నత పాఠశాల అసంపూర్తి భవన నిర్మాణానికి కోరమాండల్ సంస్థ సీఎస్ఆర్ నిధుల కింద రూ.23 లక్షలు కేటాయించింది.

PRAKASH, GAJUWAKA
Published on: 23 Nov 2026 11:57 AM IST
Visakhapatnam
X

Visakhapatnam: మింది జెడ్పీ హైస్కూల్ భవన నిర్మాణానికి కోరమాండల్ రూ.23 లక్షల సాయం!

Visakhapatnam: జీవీఎంసీ 84వ వార్డు పరిధిలోని మింది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ ముందుకు వచ్చింది. సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమంలో భాగంగా తొలి విడతగా రూ.23 లక్షల నిధులను కేటాయించింది. మిగిలిన నిర్మాణ పనులను రెండు విడతల్లో పూర్తి చేయడానికి సంస్థ సహకారం అందించనుంది.

ఈ సందర్భంగా సోమవారం పాఠశాల ప్రాంగణంలో కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.

ఈ కార్యక్రమానికి 84వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి గుడివాడ అనూష గారు, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ AVP–HR శ్రీ KVVYS నారాయణ గారు, CSR మేనేజర్ శ్రీ ఎస్. వెంకటరమణ గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ గుడివాడ అనూష గారు మాట్లాడుతూ, మింది పాఠశాల భవన నిర్మాణం పూర్తయితే విద్యార్థులకు మెరుగైన తరగతి గదులు, విద్యా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని CSR నిధుల ద్వారా సహకారం అందిస్తున్న కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ యాజమాన్యానికి, ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

84వ వార్డులో విద్యా రంగ అభివృద్ధికి, విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తామని కార్పొరేటర్ గుడివాడ అనూష గారు పేర్కొన్నారు.

PRAKASH, GAJUWAKA

PRAKASH, GAJUWAKA