గుప్పెడు వేస్తే గంపెడు కాయలన్నారు.. తీరా చూస్తే నకిలీ కంపోస్టుతో ముంచేశారు!
Anakapalli: అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం కోరుప్రోలులో కొరమండల్ ఫెర్టిలైజర్స్ నకిలీ వర్మీ కంపోస్టు స్కామ్ వెలుగులోకి వచ్చింది.
గుప్పెడు వేస్తే గంపెడు కాయలన్నారు.. తీరా చూస్తే నకిలీ కంపోస్టుతో ముంచేశారు!
Anakapalli: కొరమండల్ కంపెనీ రైతులను సిటీ వర్మీ కంపోస్టు పేరిట భారీ మోసం చేసిన ఘటన అనకాపల్లి జిల్లా ,ఎస్.రాయవరం మండలం లో కోరుప్రోలు లో వెలుగులోకి వచ్చింది .కొరమండల్ కంపెనీ ఎంప్లాయ్ సతీష్ ,డీలర్ అప్పలరాజు లు మమ్మల్ని మోసం చేసారంటూ మోస పోయిన రైతులు మీడియా కు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
రాష్ట్ర హోంమంత్రి గా ఉన్న వంగలపూడి అనిత నియోజకవర్గ పరిధిలోనే ఇలా జరిగితే మా రైతుల బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని నిరాశ చెందుతున్నారు. కొబ్బరి తోటలో సిటీ వర్మీ కంపోస్టు గుప్పెడు వేస్తే గంపెడు కొబ్బరికాయలు కాస్తాయని చెప్పడంతో 100 బస్తాలు లోడ్ తీసుకున్నామని తెలిపారు.
కొబ్బరి దిగుబడి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల కు కొరమండల్ పెర్టీలేజర్స్ ఇచ్చిన గుప్పెడు వర్మీ కంపోస్టు వేస్తే గంపెడు కాయలు కాస్తాయని యాడ్ చూసి కంపెనీ ని సంప్రదించగా కంపెనీ ఎంప్లాయ్ గా సతీష్ ,డీలర్ గా అప్పల రాజు వచ్చి మాకు ఈ నకిలీ సిటీ వర్మీ కంపోస్టు ను ఇచ్చారని తెలిపారు.రైతులకు మేలు చేయాల్సిన వారు మా ఆశతో ఆటలాడుకుంటున్నారని రైతు జగదీష్ ఆవేదన వ్యక్తంచేశారు.
ఈ విషయాన్ని డీలర్ ను ,ఎంప్లాయ్ ని అడిగితే మేము ఇచ్చే వర్మీ కంపోస్టు అలానే ఉంటుంది. మీరు ఎక్కడ పిర్యాదు చేసినా ఎవరూ పట్టుంచుకోరు అని చెప్పారని ,మేము అందరికీ మామూళ్లు ఇస్తున్నామని చెప్పారని రైతులు ఆందోళన చెందుతున్నారు.
దీనిపై వ్యవసాయ శాఖ స్థానిక అధికారుల దృష్టికి తీసుకువెళితే వారు సిటీ వర్మీ కంపోస్టు అలానే ఉంటుందని కొరమండల్ కి వత్తాసు పలికారు.దీంతో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కి ఫోన్ చేయగా చిన్న సన్న కారు రైతులతో నేను మాట్లాడను అని చెప్పడంతో మీడియా ని ఆశ్రయించాల్సి వచ్చిందని బాధిత రైతులు చెబుతున్నారు.




