Visakhapatnam: కంకి-కొడవలి గుర్తుపై ఓటేసి గెలిపించండి!

Visakhapatnam: జీవీఎంసీ 88వ వార్డు సీపీఐ కార్పొరేటర్ అభ్యర్థి స్టాలిన్ కంకి-కొడవలి గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ విస్తృత ప్రచారం నిర్వహించారు.

PRAKASH, GAJUWAKA
Published on: 25 Oct 2026 9:10 AM IST
Visakhapatnam
X

Visakhapatnam: కంకి-కొడవలి గుర్తుపై ఓటేసి గెలిపించండి!

Visakhapatnam: నవంబర్ 1 న జరుగనున్న జీవీఎంసీ ఎన్నికల్లో 88 వ నుంచి సిపిఐ పార్టీ అభ్యర్థి గా పోటీ చేస్తున్న తనను అత్యధిక ఓట్ల తో గెలిపించాలని అభ్యర్థి స్టాలిన్ ఓటర్లను కోరారు. ఎన్నికల ప్రచారం లో భాగంగా శనివారం వార్డు పరిధి లో గల గొంతి వాని పాలెం , సనత్ నగర్ , వెంకటేశ్వర కాలనీ టెంపుల్ , వంటిల్లు కూడలి ప్రాంతాలలో స్టాలిన్ ప్రచారాన్ని ముమ్మరం చేసారు.

ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ నవంబర్ 1 న జరుగనున్న జీవీఎంసీ ఎన్నికల్లో కంకి - కొడవలి గుర్తు పై అత్యధిక ఓట్లు వేసి తనను గెలిపించాలని కోరారు. గతం లో వార్డు కార్పొరేటర్ గా గెలిచి ఎంతో అభివృద్ధి చేసానని , ఈ ఎన్నికల్లో మరోసారి అవకాశాన్ని కల్పించాలని ఓటర్లను అభ్యర్థించారు.

ఈ ఎన్నికల ప్రచారం లో సిపిఐ నాయకులు టి. సాంబ మూర్తి , అప్పా రీ విష్ణుమూర్తి , జంపాన శ్రీనివాస రావు , సిరస పల్లి బాబు రావు , గడ్డయ్య , సిరస పల్లి కృష్ణ , దూసబోయి న వెంకటేశ్వ రీ , పిల్లా పద్మ ,కుడు పూ డి ఈశ్వరి , వెంకట కుమారి తదితరులు పాల్గొన్నారు.

PRAKASH, GAJUWAKA

PRAKASH, GAJUWAKA