Visakhapatnam: నిత్యావసర ధరల పెరుగుదలపై భగ్గుమన్న సీపీఐ!

Visakhapatnam: విశాఖ జగదాంబ జంక్షన్‌లో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై సీపీఐ నిరసన చేపట్టింది.

SHIVA, BHIMILI
Published on: 27 Aug 2026 2:41 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: నిత్యావసర ధరల పెరుగుదలపై భగ్గుమన్న సీపీఐ!

విశాఖపట్నం: నిత్యావసర వస్తువులు ధరలు సామాన్యులపై పిడుగులా పడి మండుతున్నాయని ధరలు అదుపు చెయ్యవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదేనని సిపిఐ జిల్లా కార్యదర్శి షేక్. రహిమాన్ డిమాండ్ చేసారు. అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న నిత్యావసర వస్తువులు కొనుగోలు చెయ్యలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గురువారం సిపిఐ విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో జగదాంబ జంక్షన్ లో నిరసన చేపట్టింది.

ఈసందర్బంగా షేక్.రహిమాన్ మాట్లాడుతూ ఐదు నెలల క్రిందట 45 రూపాయలు ఉన్న కిలో పంచదార నేడు 65 రూపాయలు అయ్యిందని, వంటనూనె లీటర్195, బియ్యం కేజీ70, కందిపప్పు180, మినపప్పు160 సామాన్యులు తినే నిత్యం వాడుకుంటున్న ధరలు విపరీతంగా పెరిగాయాని మోదీ అధికారంలోకి రాకముందు 6 నెలలలో ధరలు తగ్గించి సామాన్యులపై భారం లేకుండా చూస్తానని, విదేశాల్లో ఉన్న నల్లదనం తీసుకొచ్చి ప్రతీ పేదవాడి ఖాతాలో 15 లక్షలు జామచేస్తానని, సంవత్సరానికి 2 కోట్లు ఉద్యోగాలుతో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామ్మన్న హామీలు గాలికి వదిలేశారని విమర్శించారు అధికారంలోకి రాకముందు ఈ దేశానికి రైతేరాజని రైతే వెన్నుముక అని చెప్పి రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా దళారీ వ్యవస్థను పెంచి పోషిస్తున్నారని ఎద్దేవా చేశారు.

సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం పైడిరాజు మాట్లాడుతూ విశాఖ కనకమహాలక్ష్మి దేవస్థానం లో ముద్రించిన 200 రూపాయల నకిలీ టికెట్స్ వ్యవహారంపై జిల్లా కలెక్టరు గారు ప్రత్యేక శర్ధ తీసుకొని విచారణ చేయించి అందుకు బాద్యులైన వారిని కఠినంగా శిక్సించాలని డిమాండ్ చేశారు. గందరగోళం లేకుండా విశాఖ జీవీఎంసీ ఎన్నికల తక్షణమే నిర్వహించాలని తద్వారా ఆర్ధిక సంగం నిధులు రావడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చెయ్యాలని విజ్ఞప్తి చేశారు.

ఈనిరసనలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులు ఎం మన్మరావు, ఎం ఎ బేగం, కె వనజాక్షి, ఎన్ నాగభూషణరావు, సీనియర్ పార్టీ సభ్యులు ఎన్ సూరిబాబు, జి కాసులరెడ్డి, పార్టీ నాయకులు జె అన్వేషి, వై రాంబాబు, యు నాగరాజు, కె అచ్చుతరావు, ఎ దేముదమ్మ, కె పద్మ, బి పుష్పలత, మస్తాన్ భీ, ఎ ఆదినారాయణ, వి నల్లయ్య, జి లక్ష్మణరావు, ఎస్ కె సల్మా, టి వి రావు తదితరులు పాల్గొన్నారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story