Visakhapatnam: భోగాపురం వస్తే వైజాగ్ ఎయిర్ పోర్ట్ మూసేస్తారా!

Visakhapatnam: భోగాపురం విమానాశ్రయం ప్రారంభమైన తర్వాత కూడా విశాఖ ఎయిర్ పోర్టును డొమెస్టిక్‌గా కొనసాగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు డిమాండ్ చేశారు.

GOPI, PENDURTHI
Updated on: 9 July 2026 3:59 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: భోగాపురం వస్తే వైజాగ్ ఎయిర్ పోర్ట్ మూసేస్తారా!

Visakhapatnam: విశాఖ ఎయిర్ పోర్టును మూసివేయకుండా డొమెస్టిక్గా కొనసాగించే బాధ్యత విశాఖ జిల్లా ఎంపి, ఎమ్మెల్యేలు తీసుకోవాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కార్యాలయం ఏచూరి భవనంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి.క్రిష్ణారావులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటుచేసారు. ఈ సందర్భంగా ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ కేంద్ర బిజెపి, రాష్ట్ర కూటమి ప్రభుత్వాలు విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించిన తరువాత విశాఖ ఎయిర్ పోర్టును మూసివేసేందుకు జిఎంఆర్ సంస్థతో ఒప్పందం చేసాయి.

ఎన్నికల ముందు విశాఖను అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చేస్తామని, తమది డబుల్ ఇంజిన్ సర్కారంటూ ప్రగల్భాలు పలికిన ప్రభుత్వాలు, కూటమి నాయకులు, ఉన్న ఎయిర్ పోర్టును మూసివేయడానికి సిద్ధపడటం దారుణం. 60యేళ్ల ఘనఖ్యాతి కలిగిన వైజాగ్ ఎయిర్పోర్టును, భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమైన వెంటనే మూసివేయాలని చూడటం ఏ రకమైన అభివృద్ధిని ప్రశ్నించారు.

అభివృద్దంటే! ఉన్న ఎయిర్పోర్టు మూసివేయడమా! వేలాదిమంది ఉపాధిని, పర్యాటక, రవాణా, సేవారంగాలను దెబ్బతీయడమా ! ప్రజలపై నాలుగు రెట్లు ప్రయాణ సమయం పెంచడమా ! రవాణా, భోగాపురం ఎయిర్పోర్ట్ సర్వీసులు పేరిట పదిరెట్లు అదనపు ఛార్జీలభారం వేయడమా ! ప్రభుత్వరంగ ఎయిర్పోర్టును మూసివేసి ప్రైవేటు జీఎంఆర్ సంస్థకు సేవలు చేయడమా! విశాఖ జిల్లా ప్రజానీకానికి లేని కష్టాలు తీసుకువచ్చే ఈ విధ్వంసాన్ని ఆపాలని డిమాండ్ చేసారు.

విశాఖపట్నం జిల్లాకు చెందిన ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, పి. గణబాబు, పంచకర్ల రమేష్ బాబు, గంటా శ్రీనివాసరావు, పి. విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ యాదవ్, వెలగపూడి రామకృష్ణ తదితరులకు ప్రజల పట్ల బాధ్యత లేదా! విశాఖ ఎయిర్పోర్టు మూతకు సిద్ధమౌతుంటే ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులను ఎందుకు నిలదీయడంలేదని ప్రశ్నించారు.

వైజాగ్ ఎయిర్పోర్టును డొమెస్టిక్ ఎయిర్పోర్టుగా కొనసాగిస్తూ ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్కత్తా, హైదరాబాద్, విజయవాడ వంటి జాతీయ సర్వీసులను యదాతధంగా నడపాలని, భోగాపురం ఎయిర్పోర్టును అంతర్జాతీయ సర్వీసులకు వినియోగించేలా కృషిచేయాలని డిమాండ్ చేసారు.

బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విశాఖ ఎయిర్పోర్టు రక్షణ ఎదల చేస్తున్న ప్రకటనలు చిత్తశుద్దిలేనివన్నారు. విశాఖ ఎయిర్ పోర్టును మూసివేయాలని నిర్ణయించింది మోడీ, చంద్రబాబు ప్రభుత్వాలు. ఎయిర్పోర్టు కొనసాగించాలని బిజెపి ఎమ్మెల్యే ప్రకటనలు చేస్తున్నారు. ముఖ్యమంత్రిని అదుగుతున్నారు.

ప్రధాన మంత్రి, కేంద్ర ప్రభుత్వం జోలికి పోవడం లేదు. ఎయిర్పోర్టు మూసే నిర్ణయంలో బిజెపి ఉంది. దీనిని కొనసాగించాలని అదే బిజెపి ఎమ్మెల్యే అంటున్నారు. ఈ నాటకాలను ప్రజలు విశ్వసించరు. ఈ ఎమ్మెల్యేకి చిత్తశుద్ది ఉంటే తక్షణమే ప్రధాని మోదీని, కేంద్ర పెద్దలను కలిసి దొమోస్టిక్ ఎయిర్పోర్టుగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.

వైజాగ్ ఎయిర్పోర్ట్ రక్షణ కోసం విశాఖ ఎంపి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10 నుండి 13 వరకు బైక్ ర్యాలీలు నిర్వహించి విశాఖ ఎంపి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కార్యాలయాల్లో వినతులు సమర్పిస్తాము. వీరు కార్యాలయాల్లో అందుబాటులో లేకపోతే విశాఖలో ఎక్కడ ఉంటే అక్కడ వినతులు అందజేస్తాము. ఎయిర్ పోర్టును మూసివేత చర్యలను నిలువరించకపోతే అందోళనను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమాలను ప్రజలు జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేసారు.

ఇట్లు

ఎం.జగ్గునాయుడు

జిల్లా కార్యదర్శి

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI

Next Story