Anandapuram: గూగుల్ డేటా సెంటర్ భూసేకరణ వివాదం!
Anandapuram: ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ భూసేకరణ బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న సీపీఎం నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
Anandapuram: గూగుల్ డేటా సెంటర్ భూసేకరణ వివాదం!
Anandapuram: ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ భూసేకరణ అంశంపై రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న సీపీఎం నాయకులను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకుని ఆనందపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
సీపీఎం మాజీ కౌన్సిలర్ గంగారావు, భీమిలి డివిజన్ కార్యదర్శి ఆర్ఎస్ఎన్ మూర్తి తదితర నాయకులను జాతీయ రహదారి వద్ద పోలీసులు అడ్డగించి బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించి ఆనందపురం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు పార్టీ నాయకులు తెలిపారు.
రైతులను కలవకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన అని సీపీఎం నాయకులు ఆరోపించారు. ఈ ఘటనపై స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Next Story




