Parvathipuram: బురద నీటి సరఫరా మున్సిపల్ కార్యాలయం ఎదుట సీపీఎం నిరసన!
Parvathipuram: పార్వతీపురం లో తాగునీటి సమస్యపై మున్సిపల్ ఆఫీస్ ఎదుట సీపీఎం నిరసన. 10 ఏళ్లుగా బురద నీరు ఇస్తున్నారని మున్సిపల్ అధికారులకు వినతిపత్రం సమర్పణ.
Parvathipuram: బురద నీటి సరఫరా మున్సిపల్ కార్యాలయం ఎదుట సీపీఎం నిరసన!
Parvathipuram: దశాబ్దాలుగా పరిశుభ్రమైన తాగునీరు పొందేందుకు కూడా నోచుకోలేని పట్టణ ప్రజల దుస్థితికి అధికార కూటమి నేతలు సిగ్గు పడాలని సిపిఎం పార్టీ పట్టణ నాయకులు గొర్లి వెంకటరమణ, బి వి రమణ విమర్శించారు... గత ఎన్నికలలో ఆర్భాటంగా హామీలు ఇచ్చి, పార్వతీపురం పట్టణ ప్రజల తాగునీరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని, 80 కోట్ల రూపాయలు మంజూరు చేయించామని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వ పెద్దలు నేటికీ ఆ దిశగా కనీస చర్యలు చేపట్టకపోవడంలో ఆంతర్యం ఏమేమిటని సిపిఎం నాయకులు ప్రశ్నించారు.
మంగళవారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి మున్సిపల్ అధికారులకు వినతిపత్రం సమర్పించడం జరిగింది.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజురోజుకి పట్టణ జనాభా పెరుగుతుందని పెరుగుతున్న జనాభా కనుగుణంగా మంచినీటి సరఫరా చేయడం లేదని, ఇస్తున్న మంచినీరు కూడా గత 10 సంవత్సరాలుగా బురద నీరా సరఫరా చేస్తున్నారని దీనికి శాశ్వత పరిష్కారంగా నాబార్డ్ నిధులతో శాశ్వత మంచినీటి పథకాన్ని ప్రారంభిస్తామని గొప్పలు చెప్పుకున్న నేతలు నేటికి ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం విచారకరమని విమర్శించారు.
పట్టణంలో అనేకమంది కొళాయిల ద్వారా నీటిని మాత్రమే ఆధారంగా బ్రతుకుతున్నారని, వీరందరికీ రోజువారి సరిపడినంత పరిశుభ్రమైనతాగు నీరు సరఫరా చేయకపోవడం వలన తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లు గడుస్తున్నప్పటికీ ఆరోగ్యకరమైన మంచినీరు సరఫరా చేయకపోవడం అత్యంత దుర్మార్గమని విమర్శించారు.. ఇప్పటికైనా పార్వతీపురం పట్టణ ప్రజల తాగునీటి సమస్య పరిష్కారానికి శాశ్వత చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కొద్దిరోజుల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 30 వార్డుల లో ప్రచారం నిర్వహించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా)జిల్లా కార్యదర్శి బి లక్ష్మి, ఉపాధ్యక్షులు గౌరమ్మ, భవాని సిపిఎం పట్టణ నాయకులు బి సూరిబాబు, సంచాన ఉమామహేశ్వరరావు, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.




