Narsipatnam: నర్సీపట్నంలో నిత్యావసర ధరలు అరికట్టాలని కోరుతూ సీపీఎం ధర్నా!
Narsipatnam: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సీపీఎం ఆధ్వర్యంలో నిత్యావసర ధరల నియంత్రణ కోరుతూ ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా.. జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్.
Narsipatnam: నర్సీపట్నంలో నిత్యావసర ధరలు అరికట్టాలని కోరుతూ సీపీఎం ధర్నా!
Narsipatnam: నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నిత్యావసర సరుకుల ధరలను అరికట్టాలని, రేషన్ డిపోల ద్వారా ఉల్లి, వంటనూనె, పప్పులు తదితర సరుకులు పంపిణీ చేయాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు అడిగర్ల రాజు డిమాండ్ చేశారు.
వ్యవసాయం దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అనకాపల్లి జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించాలని, పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు సాపిరెడ్డి నారాయణమూర్తి, కేవీ సూర్యప్రభ తదితరులు పాల్గొన్నారు.




