Bheemunipatnam: భీమునిపట్నం కేజీబీవీలో కార్పొరేట్ సాయం
Bheemunipatnam: విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (KGBV) లో క్యూబ్‌వైజ్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ సీఎస్‌ఆర్ నిధులు,
Bheemunipatnam: భీమునిపట్నం కేజీబీవీలో కార్పొరేట్ సాయం
Bheemunipatnam: క్యూబివీస్ సాఫ్ట్వేర్ సోలుషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి CSR సహకారంతో, సమారిటన్స్ ఫర్ ది నేషన్ (NGO), హైదరాబాద్ ఆధ్వర్యంలో నేడు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (KGBV), భీమునిపట్నం, విశాఖపట్నంలో విద్యార్థినుల కోసం 50 డ్యూయల్ డెస్క్ బెంచీలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి కుమారి గంగా గారు, ఎస్‌ఎంసీ చైర్మన్ శ్రీ చంద్రవరపు కుమార్ గారు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విశాఖపట్నం జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ ఎన్. ప్రేమ్ కుమార్ గారు మరియు అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డా. జె. చంద్రశేఖర్ గారు బాలికల విద్యాభివృద్ధికి క్యూబివీస్ సాఫ్ట్వేర్ సోలుషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు సమారిటన్స్ ఫర్ ది నేషన్ చేపట్టిన ఈ సేవా కార్యక్రమాన్ని అభినందిస్తూ, ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
ఈ డెస్క్ బెంచీలు విద్యార్థినులకు మరింత సౌకర్యవంతమైన, పరిశుభ్రమైన, గౌరవప్రదమైన అభ్యాస వాతావరణాన్ని కల్పించనున్నాయి.
"బాలికల విద్యలో పెట్టుబడి అంటే సమాజ భవిష్యత్తులో పెట్టుబడి."




