Anakapalli: అనకాపల్లి పోలీసులపై నమ్మకం పోయింది సీబీఐ విచారణ జరిపించండి

Anakapalli: హోం మంత్రి వంగలపూడి అనితకు చోడవరం దళిత మహిళ కృప నిరసన షాక్ ఇచ్చింది. తన కొడుకు రవితేజ హత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసింది.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 13 July 2026 11:08 PM IST
Anakapalli
X

Anakapalli: అనకాపల్లి పోలీసులపై నమ్మకం పోయింది సీబీఐ విచారణ జరిపించండి

అనకాపల్లి: పోలీసులపై నమ్మకం పోయిందని, నా కొడుకు హత్య కేసును సీబీఐ విచారణ జరపాలని హోం మంత్రి వంగలపూడి అనిత కు ఒక దళిత మహిళ షాక్ ఇచ్చింది. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన పీజేఆర్ ఎస్ లో ఆమె పాల్గొన్నారు. హోం మంత్రి పి కలవాలని వచ్చిన చోడవరం కు చెందిన సోమాదుల కృపను పోలీసులు అడ్డుకున్నారు.

మీ సమస్యను అనకాపల్లి డీఎస్పీ కి చెప్పుకోవాలని, హోం మంత్రిని కలవడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. పత్రికా సమావేశం ముగించుకుని వస్తున్న హోం మంత్రి ని బాధిత మహిళలు నిలదీశారు. తన కుమారుడు రవితేజ (20) డిగ్రీ పూర్తి చేసి పోలీస్ ట్రైనింగ్ కు సిద్దమౌతున్న తరుణంలో కొందరు యువకులు హత్య చేసారని, దీనిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని, ఇందులో పోలీసులదే ప్రధాన పాత్రని ఆరోపించారు. 2024 లో సంఘటన జరిగితే నేటికీ ఛార్జ్ షీట్ వేయకపోవడం వెనుక పోలీసుల హస్తం ఉందని తెలిపారు.

పోలీసులు చెబుతున్నట్లు యాక్సిడెంట్ అయితే ఏ వాహనం ఢీ కొంది, పోలీసులు సదరు వాహనాన్ని కానీ, వ్యక్తులను కానీ ఎందుకు నేటికీ పట్టుకోలేక పోయారు. మాకు అనుమానాలు ఉన్నాయి కనుక కేసు రీ ఓపెన్ చేయాలని కోరితే ఎందుకు చేయడం లేదు ? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసి న్యాయం చేయాలని కోరితే జరిగిన ఉదంతంపై సంపూర్ణ నివేదిక ఇవ్వాలంటూ జిల్లా పోలీసు అధికారులను ఆదేశిస్తే నేటికీ నివేదిక ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

జిల్లా పోలీసు కార్యాలయం చుట్టూ కాళ్లు అరిగేలా మూడేళ్లుగా తిరుగుతున్న ఎందుకు పట్టించుకోలేదని, నిరుపేద దళితుల పట్ల ఈ విధంగా వ్యవహరించడం ఎంత వరకూ సమంజసం అని ప్రశ్నించారు. చేతికి అంది వచ్చిన ఒక్కగానొక్క కొడుకు మృతి చెందారని, గతంలో కూడా మీకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, న్యాయం జరుగుతుందన్న నమ్మకం రోజు రోజుకు సన్నగిల్లిపోతుందని, మీరు కారుణ్య మరణానికి అనుమతి ఇస్తే పోలీసు కార్యాలయం ముందే ప్రాణాలు వదులుతామని విలపించారు.

దీనిపై హోం మంత్రి స్పందిస్తూ జరిగిన దానిపై విచారణ జరిపిస్తామని, మీకు సీబీఐ విచారణ కావాలంటే సిఫార్సు లెటర్ రాస్తానని చెప్పి ఓదార్చారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI

Next Story