Visakhapatnam: విశాఖ షిప్‌యార్డ్‌లో 'సూర్య' నౌక జలప్రవేశం..ప్రారంభించిన రాజ్‌నాథ్ సింగ్!

Visakhapatnam: విశాఖపట్నం హిందూస్తాన్ షిప్‌యార్డ్‌లో తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ 'సూర్య'ను ప్రారంభించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 6 Oct 2026 12:31 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖ షిప్‌యార్డ్‌లో 'సూర్య' నౌక జలప్రవేశం..ప్రారంభించిన రాజ్‌నాథ్ సింగ్!

Visakhapatnam: విశాఖపట్నం హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో కీలక కార్యక్రమాలు జరిగాయి. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖలో హిందూస్తాన్ షిప్ యార్డ్ లో పలు కీలక నౌకా నిర్మాణ కార్యక్రమాలను ప్రారంభించారు. భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న తొలి Fleet Support Ship – FSS-1ను రాజ్‌నాథ్ సింగ్ ప్రవేశపెట్టారు, ఈ షిప్ కు సూర్య అని నామకరణం చేసారు.

అదే సమయంలో FSS-5 నిర్మాణానికి Keel Laying కార్యక్రమాన్ని నిర్వహించారు. హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో ఆధునీకరించిన స్లిప్ వే-4ను కూడా ప్రారంభించారు. అలాగే 300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియాత్ క్రేన్ ను ప్రారంభించారు. ఈ ఆధునిక సదుపాయాలతో హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో మరింత భారీ నౌకలను నిర్మించే సామర్థ్యం పెరగనుంది.

45 వేల DWT వరకు బరువున్న నౌకలను నిర్మించి, జలప్రవేశం చేయించే సామర్థ్యం షిప్‌యార్డ్‌కు అందుబాటులోకి వచ్చింది. భారత నౌకాదళం కోసం మొత్తం 5 Fleet Support Ships నిర్మిస్తున్నారు. వాటిలో తొలి నౌక FSS-1. దీని బరువు 43,500 టన్నులు.

సముద్రంలో ఉన్న యుద్ధనౌకలకు అవసరమైన సరఫరాలను అందించడంలో Fleet Support Ships కీలకంగా పనిచేయనున్నాయి.

దీని ద్వారా హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత నౌకాదళం ఎక్కువ కాలం, మరింత దూరం కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలు కలుగుతుంది. FSS-1 కేవలం 18 నెలల్లోనే స్టీల్ కేటింగ్ నుంచి జలప్రవేశం దశకు చేరుకోవడం ఈ ప్రాజెక్టు వేగాన్ని చూపిస్తోంది. FSS-5కు Keel Laying చేయడంతో ఈ నౌకల నిర్మాణ కార్యక్రమం సిరీస్ ప్రొడక్షన్ దిశగా ముందుకు సాగుతోంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, విశాఖ ఎంపీ భరత్, ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, ఎమ్మెల్యే గణబాబు తదితరులు పాల్గొన్నారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.