Araku: అరకులోయలో మీనాక్షి మృతిపై సమగ్ర విచారణ జరపాలి!
Araku: అరకులోయలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఐటీఐ విద్యార్థిని మీనాక్షి మృతిపై సమగ్ర విచారణ జరపాలని ఆదివాసీ పరిరక్షణ సమితి అధ్యక్షులు చట్టు మోహన్ బుధవారం డిమాండ్ చేశారు.
Araku: అరకులోయలో మీనాక్షి మృతిపై సమగ్ర విచారణ జరపాలి!
అరకు: అరకు లోయలో నిన్న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ITI విద్యార్థిని కిలో మీనాక్షి (20) మృతి పై సమగ్ర నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ప్రజా ప్రతినిధులతో కలిసి ఆదివాసీ పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు శ్రీ చట్టు మోహన్ గారు డిమాండ్ చేశారు. ఈ మేరకు బాధితులను నాయకులు ప్రజాప్రతినిధులు కలిసి హాస్పిటల్ లో తరలించారు.
ఏరియా ఆసుపత్రి నుంచి పోలీస్ స్టేషన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ గారు మాట్లాడుతూ... మృతి చెందిన మీనాక్షి కుటుంబాన్ని అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నాయకులు ఉద్యోగ సంఘాలు ప్రజాసంఘాలు తదితరులు పాల్గొన్నారు.




